Begin typing your search above and press return to search.

మోడీ ఫెయిల‌యిపోయారంటున్న అమెరికా

By:  Tupaki Desk   |   1 Jan 2018 9:25 AM GMT
మోడీ ఫెయిల‌యిపోయారంటున్న అమెరికా
X
స్వాతంత్ర్యం వ‌చ్చి దాదాపు డెబ్బై ఏండ్లు పూర్త‌వుతున్న‌ప్ప‌టికీ....భార‌త్ ఇంకా అభివృద్ధి చెందుతున్న‌ దేశంగానే ఉండ‌టం అనేకమందిని విస్మ‌యానికి గురిచేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌న‌లాంటి దేశాలు మిగ‌తా దేశాల స‌ర‌స‌న చేరాలంటే..మ‌న స్వ‌యం స‌మృద్ధితోపాటుగా....విదేశీ పెట్టుబ‌డులు కూడా రావాల్సిందే. అయితే అలాంటి కీల‌క ప్రక్రియ‌కు అవినీతి అడ్డుప‌డుతోంది. భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలంటే అవినీతి ఓ పెద్ద ప్రతిబంధకంగా మారుతోందని, అందుకే విదేశీ మదుపుదారులు ధైర్యంగా ముందుకు రావడం లేదని అమెరికాకు చెందిన ఓ యాజమాన్య నిర్వహణ సంస్థ క్రోల్ వెల్లడించింది.భారతదేశంలో అనేక రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉన్నప్పటికి కూడా అవినీతి కారణంగానే ఇన్వెస్ట‌ర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు వేయాల్సి వస్తోంది ఈ సంస్థ తెలిపింది.

2014లో మోడీ సారథ్యంలో బలమైన - స్థిరమైన కేంద్ర ప్రభుత్వం ఆవిర్భవించినప్పటికి కూడా విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడి అనుకూల అవకాశాల కోసం ఎదురుచూశారని, అలాగే వ్యాపార నిర్వహణలోనూ గుణాత్మకమైన మార్పులనూ ఆశించారని ఈ సంస్థ వెల్లడించింది. కానీ ఆశించినట్టుగా భారతదేశంలో వ్యాపార నిర్వహణకు సంబంధించి మార్పులు రాలేదని ఈ కన్సల్టెన్సీ సంస్థ తెలిపింది. ముఖ్యంగా ప్రభుత్వం ఎప్పుడు ఏరకమైన ప్రతికూల నిర్ణయం తీసుకుంటుందోన్న ఆందోళన ఇన్వెస్టర్లను నిరంతరం పీడిస్తోందని, అలాగే నిరుద్యోగం కారణంగా తలెత్తే అవకాశం ఉన్న సాంఘిక అనిశ్చితి కూడా ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. వీటితోపాటు రాష్టస్థ్రాయిలో ప్రతికూల రాజకీయాలు - బ్యాంకింగ్ వ్యవస్థ రాని బాకీలతో కునారిల్ల కూడా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సంబంధించి ఉత్సాహంగా రాకపోవడానికి ప్రధాన హేతువుగా మారాయని ఈ సంస్థ తెలిపింది.

అయితే, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపారానికి సంబంధిచిన ప్రతికూలతలు తొలిగాయా అన్న అంశంపైన ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తరుణ్ భాటియా సానుకూలంగానే స్పందించారు. మోడీ హయాంలో వ్యాపార అనుకూల పరిస్థితులు బలపడినప్పటికీ ఇంకా ఎంతో జరిగి ఉండాల్సి ఉందన్న అభిప్రాయం విదేశీ ఇన్వెస్టర్లలో చాలా బలంగా కనిపించదన్నారు. ఎన్‌ డీఏ ప్రభుత్వం హామీల ప్రాతిపదికగా భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినందున వ్యవస్థాగతంగా విస్తృత మార్పులు వస్తాయని విదేశీ ఇన్వెస్టర్లు ఆశించారని, కానీ దురదృష్టవశాత్తూ ఆశించిన రీతిలో వ్యవస్థాగతమైన మార్పులు చోటుచేసుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలను ప్రక్షాళన చేసే లక్ష్యంతో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టినప్పటికీ అంతిమంగా అవి ఎంతమేరకు ఆశించిన ఫలితాలు అందిస్తాయన్నది ఇప్పటికీ స్పష్టం కావడం లేదని ఈ సంస్థ తెలిపింది.

ప్రభుత్వ ఉదాత్త ఆశయాలతో సంస్కరణలను చేపట్టినప్పటికీ అవినీతి కారణంగా అనుకున్న ప్రయోజనాలు సిద్ధించడం లేదని, పేదలకు ప్రయోజనాలు కూడా అందడం లేదని ఈ సంస్థ తెలిపింది. పెద్దనోట్ల రద్దు - వస్తు సేవల పన్నును ప్రవేశపెట్టడం - అన్నిరంగాల్లోనూ ఆన్‌ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టడం - వ్యాపార అనుకూలతను పెంపొందించండం వంటి చర్యలు వ్యవస్థలో సానుకూల మార్పులు తీసుకువచ్చాయని ప్రో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెల్లడించారు. అయితే, అవినీతిని అదుపు చేయడంలో ఇంకా ఎంతో కృషి జరగాల్సి ఉందని, ఇప్పటికీ అనేక రంగాలు ఈ జాఢ్యం బారినపడి కునారిల్లడం వల్లే 20 శాతానికి పైగా విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులతో ముందుకు రావడానికి సందేహిస్తున్నారు.