Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీలుగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన పెనుమత్స సురేష్, జాకీయా ఖానుమ్

By:  Tupaki Desk   |   6 Oct 2020 5:00 PM GMT
ఎమ్మెల్సీలుగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన పెనుమత్స సురేష్, జాకీయా ఖానుమ్
X
ఎమ్మెల్సీగా వైఎస్సార్‌సీపీ‌ సీనియర్‌ నాయకుడు దివంగత నేత పెనుమత్స సాంబశివరాజు తనయుడు డాక్టర్‌ సూర్యనారాయణరాజు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఆయన నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఒక్కటే నామినేషన్ దాఖలు కావడంతో సురేష్‌ బాబు ఏకగ్రీవం అయ్యారు. తాజాగా అయన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసారు. ఈయనతో పాటుగా జకీయా ఖానుమ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్‌ షరీఫ్‌ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎంలు పుష్ప శ్రీవాణి, అంజాద్‌ భాషా, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ .. సీఎం జగన్ ఎమ్మెల్సీల ఎంపికలో ప్రత్యేక శైలి పాటించారని, చరిత్రలో తొలిసారి మైనార్టీ మహిళ జకీయా ఖానుమ్‌ ను శాసన మండలికి పంపారు అని తెలిపారు. సీఎం ‌ జగన్‌ తో తొలి రోజు నుంచి వెన్నంటే ఉన్న పెనుమత్స సాంబశివరాజు కుమారుడు పెనుమత్స సురేష్ ‌కి అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు.పార్టీని నమ్ముకున్న వారికి సీఎం‌ జగన్‌ తగిన ప్రాధాన్యం ఇచ్చారని ఈ ఇద్దరి ఎంపికతో మరోసారి రుజువు అయింది అని అన్నారు.