Begin typing your search above and press return to search.
కౌంట్ డౌన్ : సోముకు రెన్యువల్ ఉండదా....?
By: Tupaki Desk | 1 Jun 2022 1:30 AM GMTఆయన బీజేపీ మాతృ సంస్థ ఆరెస్సెస్ నుంచి పనిచేస్తూ వస్తున్నారు. కరడు కట్టిన కాషాయం నేత. అయినా ఆయనకు పదవులు ఏవీ పెద్దగా దక్కలేదు అన్న సానుభూతి అయితే అప్పట్లో ఉండేది. ఆయన టీడీపీ బీజేపీ కాంబినేషన్ లో ఏపీలో అధికారంలోకి వచ్చినపుడు 2015లో ఎమ్మెల్సీగా నెగ్గారు. అదే ఆయన తొలి అధికార పదవి. ఆ పదవీకాలం గత ఏడాదితో ముగిసింది.
ఇక మరో వైపు చూస్తే 2020 జూలైలో ఆయనకు బీజేపీ అధినాయకత్వం న్యాయం చేస్తూ ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పోస్ట్ ని కట్టబెట్టింది. మరో నెలలో ఆ పదవి ముగుస్తోంది. మరి ఈ రెండేళ్ళలో సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఏం చేశారు, పార్టీ గ్రాఫ్ ఎంత పెంచారు అన్న చర్చకు వస్తే నిరాశే అన్న మాట వినిపిస్తోంది.
అన్నిటికంటే ముఖ్యంగా జనసేనతో బీజేపీ సంబంధాలు సోము హయాంలో బాగా బలపడతాయని అంతా అనుకున్నారు. దానికి తగినట్లుగానే సోము ప్రెసిడెంట్ కాగానే మెగాస్టార్ చిరంజీవిని, జనసేనాని పవన్ని కలసి వచ్చారు మెగా ఫ్యామిలీతో తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని రెండు పార్టీలను ఏపీలో జంటగా చేసి పవర్ ఫుల్ కాంబోను తయారు చేస్తానని చెప్పుకున్నారు.
కానీ జరిగింది వేరు. సోము వీర్రాజు ప్రెసిడెంట్ గా ఉండగా జనసేన తో గ్యాప్ బాగా పెరిగింది అన్న చర్చ అయితే వస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటీ అంటే గత ఏడాదిగా పవన్ కళ్యాణ్ సోము వీర్రాజు మధ్య మాటలు కూడా లేవని అంటున్నారు. ఈ నేపధ్యంలో సోము వీర్రాజు బీజేపీని సొంతంగా అయినా ఏపీలో పటిష్టం చేసారా అంటే అదీ లేదు అన్న మాట ఉంది.
దాంతో ఆయన పదవీకాలం ముగిశాక రెన్యూవల్ చేస్తారా అన్న చర్చకు సమాధానం మాత్రం లేదు అనే వస్తోంది. సోము వీర్రాజు బీజేపీ ప్రెసిడెంట్ గా ఉండగానే తిరుపతి లోక్ సభతో పాటు కడప జిల్లా బద్వేల్ లో ఉప ఎన్నిక జరిగింది. రెండు చోట్లా బీజేపీకి డిపాజిట్లు పోయాయి. ఇక జనసేన మద్దతు కూడా అంతంతమాత్రంగానే లభించింది.
ఇక ముచ్చటగా మూడవ ఉప ఎన్నిక ఆత్మకూరు లో ఎదుర్కోబోతున్నారు. మరి ఇక్కడ కూడా ఫలితాలు ఏమీ వేరేగా ఏమీ రావు అనే అంటున్నారు. మరో వైపు చూస్తే ఏపీలో వైసీపీ వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మళ్ళించడంతో సోము విఫలం అయ్యారు అని పార్టీలోనే అంటున్నారు. టీడీపీని విమర్శిస్తూ చంద్రబాబుతో పొత్తు లేదని చెబుతూ సోము రాజకీయం రాంగ్ రూట్ లోకి తీసుకెళ్తున్నారు అని అంటున్నారు.
ఇక ఒక్క విషయం మాత్రం చూస్తే సోము పదవి ఉంటుందా లేదా అన్నది స్పష్టం అవుతుంది అని చెబుతున్నారు. ఏపీలో వైసీపీతో కేంద్ర బీజేపీ పెద్దల రిలేషన్స్ బాగా ఉంటే కనుక సోము పదవీ కాలం కంటిన్యూ అవుతుంది. మరో రెండేళ్ళ పాటు అంటే 2024 ఎన్నికలు ముగిసేవరకూ ఆయన కొనసాగుతారు. అలా కాదు, వైసీపీ మీద కేంద్ర బీజేపీ యుద్ధం ప్రకటించేసినట్లే అనుకుంటే మాత్రం ఆయన మాజీ అవుతారు.
అపుడు వైసీపీని పూర్తిగా వ్యతిరేకించే వారి చేతికి పగ్గాలు అందుతాయని అంటున్నారు. ఆ లిస్ట్ లో చూసుకుంటే మాజీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అగ్రభాగాన ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ ఇద్దరిలో ఎవరికి పదవి ఇచ్చినా కూడా వైసీపీకి షాక్ టీడీపీకి లాభం కలుగుతాయనే అంటున్నారు. సోము పదవి విషయంలోనే ఈ క్లారిటీని కేంద్ర బీజేపీ పెద్దలు ఇస్తారని చెబుతున్నారు.