Begin typing your search above and press return to search.

భారత్ లో నకిలీ వ్యాక్సిన్లు గుర్తించాం: WHO

By:  Tupaki Desk   |   18 Aug 2021 1:30 PM GMT
భారత్ లో నకిలీ వ్యాక్సిన్లు గుర్తించాం: WHO
X
భారత్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ప్రస్తుతానికి 50 కోట్ల మంది వరకు వ్యాక్సిన్లు వేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) ఈ మేరకు ఒక కీలక ప్రకటన చేసింది.

భారత్, ఉగాండాలో నకిలీ కోవీషీల్డ్ వ్యాక్సిన్లను గుర్తించామని డబ్ల్యూహెచ్.వో సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి మెడికల్ అలర్ట్ జారీ చేసింది.

ఆస్పత్రులు, ఫార్మసీలు, మెడికల్ ఉత్పత్తులను సప్లై చేసే సంస్థల్లో తనిఖీలు చేపట్టాలని కేంద్రానికి సూచించింది. ఫేక్ టీకాలతో ముప్పు ఎక్కువగా ఉందని.. బాధితులకు మెడికల్ సాయం అందించాలని పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యానికి నకిలీ వ్యాక్సిన్లు పెద్ద సమస్యగా మారాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. నకిలీ టీకాలను గుర్తించి వెంటనే వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఇప్పటికే రెండు దేశాల్లో చేపట్టిన వేర్వేరు దర్యాప్తుల్లో ఈ నకిలీ వ్యాక్సిన్ల బాగోతం బయటపడింది. మెక్సికోలో సుమారు 80మందికి ఇలాగే నకిలీ టీకాలు వేశారు. అయితే వారిలో సైడ్ ఎఫెక్ట్ లు వచ్చినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు. ఈ నకిలీ టీకా తీసుకోవడం వల్ల వారికి కోవిడ్ నుంచి ఎలాంటి రక్షణ లభించదు.

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లకు డిమాండ్ పెరగడం.. దానికి తగ్గట్టుగా సప్లయి లేకపోవడంతో నకిలీ టీకాలను తయారు చేసి కొందరు కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. టీకాలు చాలా తక్కువగా సప్లయి చేస్తున్నారు. ఇత కంపెనీలు కూడా వ్యాక్సిన్ తయారీలోకి దిగితే అప్పుడు డోసుల సంఖ్య పెరుగుతుంది. అవసరానికి తగ్గట్టుగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.