Begin typing your search above and press return to search.

ఆగిన అమెరికా ఎన్నికల కౌంటింగ్.. కారణమిదే?

By:  Tupaki Desk   |   4 Nov 2020 5:40 PM GMT
ఆగిన అమెరికా ఎన్నికల కౌంటింగ్.. కారణమిదే?
X
అమెరికా ఎన్నికల ఫలితాల కౌంటింగ్ చివరిదశలో ఆగిపోయిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అమెరికాలోని కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది. అయితే సడన్ గా ఈ ఫలితాలు ఆగినట్టు తెలిసింది. మొత్తం 538 ఎలక్ట్రోరల్ ఓట్లు లెక్కించాల్సి ఉండగా.. ఇప్పటిదాకా 452 ఎలక్ట్రోరల్ ఫలితాలు వచ్చాయి.

మరో 86 ఎలక్ట్రోరల్ ఫలితాలు రావాల్సి ఉంది. అయితే మిగిలిన ఎలక్ట్రోరల్ ఫలితాలపై స్పష్టత రావడం లేదు. చాలా సమయం నుంచి కౌంటింగ్ ఆగిపోయినట్టు తెలిసింది. ఈ విషయమై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

అమెరికా ప్రభుత్వం కూడా దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. కౌంటింగ్ కొద్దిరోజులకు వాయిదా పడిందని కొంతమంది చెబుతున్నారు. పోస్టల్ ఓట్లు లెక్కింపులో ఆలస్యం వల్ల ఆలస్యమై ఉంటుందేమోనని కొందరు అంటున్నారు.

ఇప్పటివరకు పోలైన ఎలక్ట్రోరల్ ఓట్లలో డెమొక్రటిక్ అభ్యర్థి బైడెన్ ముందంజలో ఉన్నారు. ఆయనకు 238 ఎలక్ట్రోరల్ ఓట్లు వచ్చాయి. ఇక రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్వల్పంగా వెనుకబడి ఉన్నారు. ఆయనకు 213 ఓట్లు వచ్చాయి. మొత్తం ఓట్ల పరంగా చూసుకుంటే బైడెన్ ముందున్నారు.

ఇప్పటిదాకా బైడెన్ కు 6,91,10,907 ఓట్లు రాగా.. ట్రంప్ కు 6,68,28,388 ఓట్లు వచ్చాయి.