Begin typing your search above and press return to search.
కరోనా ఎఫెక్ట్.. న్యూజెర్సీలో కర్ఫ్యూ.. ఆ దేశాల సరిహద్దుల్ని మూసేశారు
By: Tupaki Desk | 16 March 2020 5:13 AM GMTచైనాను వణికించిన కరోనా.. ఇప్పుడు ప్రపంచ దేశాలకు తన ప్రభావం ఏమిటో చూపిస్తోంది. చైనాకు పరిమితమైన ఈ వైరస్.. విదేశీ ప్రయాణికుల రూపంలో వివిధ దేశాలకు పాకటం.. ఈ మహమ్మారిని నిలువరించటంలో జాగ్రత్తలు తీసుకున్నప్పటికి అది ప్రభావంతంగా సాగకపోవటంతో ఈ వైరస్ చాపకింద నీరులా విస్తరించింది. ఇప్పుడు తానేమిటో చూపిస్తున్న ఈ పిశాచికి దేశాలకు.. దేశాలు వణికిపోవటమే కాదు.. భయం గుప్పిట్లో ప్రపంచం ఇరుక్కుందని చెప్పాలి.
కరోనా తీవ్రత రోజు రోజుకి పెరిగి పోతున్న నేపథ్యం లో ఆయా దేశాల పాలకులకు ఈ వైరస్ ను కట్టడి చేయటం తలకు మించిన భారం అవుతోంది. దీంతో.. పలు దేశాలు తమ సరిహద్దుల్ని మూసేసి.. బయట దేశాల వారిని తమ దేశంలోకి అడుగు పెట్టకుండా చూస్తోంది. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా ధాటికి కిందా మీదా పడుతోంది. మొన్నటి వరకూ యూరప్ లోని కొన్ని దేశాలకు చెందిన వారు తమ దేశంలోకి అడుగు పెట్టే విషయం లో ఆంక్షలు పెట్టిన అమెరికా.. ఇప్పుడు వాటిని ఐర్లాండ్.. బ్రిటన్ దేశాలకు విస్తరిస్తూ నిర్ణయం తీసుకుంది.
కరోనాను కంట్రోల్ చేయటానికి సరిహద్దుల్ని మూసివేయటం.. ఇతర దేశస్తులు.. ప్రాంతాల వారు రాకుండా చేయటం ద్వారా అంతో ఇంతో ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని గుర్తించిన అమెరికా యుద్ధ ప్రాతిపదికన చర్యల్ని చేపట్టింది. తాజాగా న్యూజెర్సీ లో కర్ఫ్యూను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పలు దేశాలు తమ సరిహద్దుల్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అందులో డెన్మార్క్.. పోలండ్.. చెక్ రిపబ్లిక్.. స్లోవేకియా.. నార్వే తదితర దేశాలు చేరాయి. నార్వే.. పోలండ్ సరిహద్దుల నుంచి తమ దేశంలోకి విదేశీయులు ఎవరూ రాకుండా ఉండేందుకు వీలుగా సరిహద్దుల్ని మూసివేయనున్నట్లుగా రష్యా ప్రకటించింది.
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా నగరం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా.. అదే సమయంలో నగరంలోకి కొత్తవారు ఎవరూరాకుండా ఉండేలా ఆంక్షలు విధించారు. ఫ్రాన్స్ లో రెస్టారెంట్లు..కేఫ్ లు.. థియేటర్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చాలా వేగంగా ప్రపంచం హెల్త్ ఎమర్జెన్సీ దిశగా పరుగులు తీస్తోంది. డిజిటల్ యుగంలో ప్రపంచం కుగ్రామం గా మారితే.. కరోనా పుణ్యమా అని ఒక దేశంలోని పలు నగరాల మధ్య రాకపోకలు బంద్ అయిన దుస్థితి చోటు చేసుకుంది.