Begin typing your search above and press return to search.
తాలిబన్లకు ఈ దేశాల సహకారం ఉందా..?
By: Tupaki Desk | 17 Aug 2021 8:30 AM GMTఅప్ఘనిస్తాన్ ఇప్పుడు తాలిబన్ల చెరలో పడింది. 15 ఆగస్టున కాబుల్ ను తాలిబన్లు ఆక్రమించడంతో ఇక వారి పాలనే సాగనుంది. ఇప్పటికే సైనిక బలగాలు, కొందరు ప్రభుత్వ అదికారులు తాలిబన్లకు లొంగిపోయారు. వారికి మద్దతు ఇచ్చినట్లు ప్రకటించారు. దీంతో ఇక తాలిబన్ల రాజ్యంగా మారిపోయింది. తాలిబన్లు ఒకప్పటి పాలన గుర్తుకు తెచ్చుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది. కఠిన నియమాలతో పాటు స్వేచ్ఛకు సంకెళ్లు వేసే వారి పాలన అంటే ఆ దేశ ప్రజలకే కాకుండా ఇతరుల్లో కూడా భయాందోళ వ్యక్తమవుతుంది. అమెరికా బలగాల ఉపసంహరణ తరువాత కేవలం 10 రోజుల్లోనే అప్ఘనిస్తాన్ ను ఆక్రమించి వారి పట్టును నిలపుకున్నారు. ఈక్రమంలో ప్రపంచం మొత్తం తాలిబన్ల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
తాలిబన్ల ప్రస్థానం 1980లో ప్రారంభమైంది. ఆ సమయంలో సోవియట్ యూనియన్ దళాలు అప్ఘనిస్తాన్ ను ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అయితే ఈ సమయంలో సోవియన్ యూనియన్ కు వ్యతిరేకంగాకు ముజాహిదీన్ గ్రూపులు, సైన్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. వీరికి అమెరికా, పాకిస్థాన్ సహకారాలు ఉండేవి. దీంతో 1989లో సోవియట్ యూనియన్ ఆప్ఘనిస్తాన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంది. సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా పోరాడిన వాళ్లల్లో ముల్లా మహ్మద్ ఉమర్ ఒకరు. ఈయన కొంత మంది యువకులతో కలిసి తాలిబన్ అనే ఉద్యమాన్ని ప్రారంభించాడు.
తాలిబన్ అంటే పర్షియన్ భాషలో విద్యార్థి అని అర్థం. తాలిబన్ల పోరాటానికి కొందరు యువకులు ఆకర్షితులై వీరి గ్రూపులో చేరడం ప్రారంభించారు. అలా ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి చేరుకున్నారు. ఈ సమూహానికి ఒక అధిపతి ఉండగా, ముగ్గురు డిప్యూటీ నాయకులు ఉంటారు. వీరి కింద నాయకత్వ మండలి ఉంటుంది. దీనిని రహబారి షురా అనింటారు. ఆ తరువాత ప్రత్యేక గవర్నర్లు, కమాండర్లను నియమించుకుంటారు.
తాలిబన్ల రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. 1996 నుంచి 2001 నాలుగేళ్లపాటు తాలిబన్ ఆప్ఘనిస్తాన్ ను పాలించారు. ఆసమయంలో వారు కొన్ని నిబంధనలు పెట్టారు. పురుషులు గెడ్డం పెంచుకోవాలి.. గెడ్డం గీస్తే నేరం కింద పరిగణిస్తారు. మహిళలు తప్పనిసరిగా బురఖా ధరించారు. 12 ఏళ్లు పైబడిన వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో చదువుకోవద్దు. హత్య చేసినా.. దొంగతనం చేసినా.. బహిరంగంగా ఉరితీయడమే శిక్ష. ఇక వీరు పెట్టిన రూల్స్ అతిక్రమిస్తే తుపాకుల గుళ్లకు బలి కావాల్సిందే. తాలిబన్లు వారు అప్ఘనిస్తాన్ ను పాలించడమే కాకుండా చాలా మంది ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారు.
అంతకుముందు తాలిబన్లకు ఆశ్రయం కల్పించిన ఆమెరికాతోనే వారు యుద్ధం చేశారు. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రడ్ సెంటర్ ను ఆల్ ఖైదా సంస్థ కూల్చి వేసిన ఘటన కలకలం రేపింది. ఆ సమయంలో వీరు నాలుగు విమానాలను హైజకా్ చేసి 2996 మంది చావుకు ఆ సంస్థ కారణ మైంది. ఈ సంస్థలో ప్రధాన వ్యక్తిగా ఉన్న ఒసామా బిన్ లాడెన్ ను హతం చేయడానికి అమెరికా ప్రయత్నించింది. దీంతో అతడు అప్ఘనిస్తాన్ లో దాక్కున్నాడని గుర్తించింది. అయితే ఆ సమయంలో అమెరికా అప్ఘనిస్తాన్ పై దాడి చేసింది. ఈ సమయంలో ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చినందుకు అప్ఘనిస్తాన్ పై అమెరికా ఆగ్రహించింది.
తాజాగా తాలిబన్లు మరోసారి రష్యా, చైనాతో చేతులు కలపనున్నట్లు సమాచారం. తమ కార్యకలాపాలను ఆ దేశాల సహకారంతో నడిపిస్తారని అంటున్నారు. అయితే ఇటీవల తాలిబన్లు ప్రజలను హింసిచడం మా ఉద్దేశం కాదని ప్రకటించారు. అయితే ప్రజల్లో భయాందోళన కొనసాగుతూనే ఉంది. గత పాలన గుర్తు తెచ్చుకున్నవారు ఇప్పటికే దేశం విడిచి వెళ్లారు. కొందరు కాబూల్ విమానాశ్రయం నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు.