Begin typing your search above and press return to search.
నోట్ల రద్దుతో దేశాలే నాశనమయ్యాయి
By: Tupaki Desk | 20 Nov 2016 5:30 PM GMTఆఫ్రికా ఖండంలోని పలు దేశాల పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. సంచి నిండా డబ్బు తీసుకెళ్తే జేబులో పట్టేసే బిస్కెట్ ప్యాకెట్ మాత్రమే వస్తుంది. అక్కడి ఆర్థిక వ్యవస్థ అంతలా కుప్పకూలింది. పాలకుల అనాలోచిత ఆర్థిక విధానాలు - అవినీతి అలాంటి పరిస్థితులను కల్పించాయి. వాటిలో చాలా దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు గాడి తప్పడానికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాలే బీజం వేశాయి. దాని వల్ల కుదుపు నుంచి బయటపడడానికి తీసుకున్న నిర్ణయాలు మరింత ముంచేశాయి. దీంతో ఆఫ్రికా దేశాల ఆర్థిక నిపుణులు ఎవరైనా పెద్ద నోట్ల రద్దు అనగానే భయపడిపోతారట. తమ దేశాల్లోని దారుణ అనుభవాలను చూసినవారు ప్రపంచంలోని ఇంకేదేశానికీ ఇలాంటి కష్టం రాకూడదని కోరుకుంటారు. ఆఫ్రికా దేశాలే కాదు.. మన పొరుగునే ఉన్న మయన్మార్... ఆసియా ఖండంలోనే ఉన్న ఉత్తర కొరియాలూ నోట్ల రద్దు బాధిత దేశాలే. అయితే.. ఇండియాలోనూ నోట్ల రద్దుతో జనం కష్టాలు పడుతున్నా మోడీపై ప్రజల్లో గట్టి నమ్మకమే కనిపిస్తోంది. ఆయన అనాలోచితంగా ఈ నిర్ణయం తీసుకుని ఉండకపోవచ్చని... పక్కా ప్రణాళిక ఉందని భావిస్తున్నారు. నోట్ల రద్దుకు ఉన్న నాశన చరిత్రను మోడీ తిరగరాస్తారని అనుకుంటున్నారు. ఏమవుతుందో కాలమే చెప్పాలి.
బర్మా: నల్లధనాన్ని నియంత్రించడం కోసం 1987లో మయన్మార్ లో అక్కడి మిలటరీ గవర్నమెంటు కరెన్సీ విలువను దాదాపు 80 శాతం తగ్గించింది. ఇది అక్కడి ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసింది. డబ్బు చలామణీ పూర్తిగా తగ్గిపోవడం... అవసరాలకు డబ్బులేకపోవడంతో దొంగతనాలు పెరిగిపోయాయి.. డబ్బుకోసం దాడులు, హత్యలు.. ఒకటేమిటి డబ్బుతో సంబంధమున్న అన్ని రకాల నేరాలు తీవ్రమయ్యాయి.
ఉత్తర కొరియా: ఉత్తరకొరియాలో అధ్యక్షుడు కింగ్ జాంగ్ పెద్ద నోట్లతో పాటు పాత నోట్లన్నీ రద్దు చేశారు. కానీ... సరిపడా కరెన్సీని అందుబాటులోకి తేలేకపోయారు. దీంతో జనం ఏమీ కొనుక్కోలేక చివరికి తిండి కూడా తినలేక నానా కష్టాలు పడ్డారు. ఆ సమస్య నుంచి కోలుకోవడానికి చాలాకాలం పట్టింది.
జింబాబ్వే: జింబాబ్వేలో కరెన్సీకే విలువ లేకుండా పోయింది. దాంతో ట్రిలియన్ జింబాబ్వే డాలర్ కరెన్సీ కూడా ప్రింటు చేయాల్సినంత స్థాయికి ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. రాబర్డ్ ముగాబే అధ్యక్షుడయ్యాక దాన్ని రద్దు చేశారు. ఆ నోటు స్థానంలో 0.5 డాలర్లకంటే తక్కువ విలువకగలిగిన నోట్లను ప్రవేశపెట్టారు. ద్రవ్యోల్బనం అదుపులోకి రాకపోగా ఆర్థిక వ్యవస్థే అతలాకుతలమైంది.
ఘనా: 1982లో ఘనాలో హయ్యర్ వేల్యూ కరెన్సీని రద్దు చేశారు. ఆ తరువాత పరిస్థితులు మారిపోయాయి. బ్లాక్ మార్కెట్ పెరిగిపోయింది. సమాజంలోని కొన్ని వర్గాలు ఆస్తుల్ని కూడగట్టుకున్నాయి. బ్లాక్ మార్కెట్లలో కొనుగోలు చేయలేక కొందరు నిరుపేదలయ్యారు. ఆర్థిక అంతరాలు భారీగా పెరిగిపోయాయి. ఘనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.
నైజీరియా: 1984లో నైజీరియాలో అధ్యక్షుడు మహ్మద్ బుహారి అంతవరకున్న పాత నోట్లన్నింటిని రద్దు చేశారు. కొత్తనోట్లను ప్రవేశపెట్టారు. దీంతో అక్కడ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. నైజీరియాను ఆర్థికమాంద్యం దీర్ఘకాలం వెంటాడింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/