Begin typing your search above and press return to search.
వేలల్లో కరోనా మరణాలు..దాచేస్తున్న దేశాలు
By: Tupaki Desk | 21 April 2020 5:30 PM GMTకరోనా మరణాలను దేశాలు దాచేస్తున్నాయా? ఆస్పత్రులు, ప్రధాన నగరాల్లో జరిగిన మరణాలనే నమోదు చేస్తున్నాయా? గ్రామాలు - ఇంట్లో కరోనాతో మరణించిన వారి లెక్కను కరోనాకు కలపడం లేదా? అంటే ఔననే అంటున్నారు పరిశోధకులు.
అప్పట్లో హైదరాబాద్ లో ఓ వృద్ధుడు పరిస్థితి విషమించి ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. వైద్యులకు డౌట్ వచ్చి పోస్టుమార్టం చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. అంటే కరోనా రోగం వచ్చినా అది తెలియకుండానే ఆ వృద్ధుడు చనిపోయాడు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా మీడియా సమావేశంలో తెలిపాడు.ఇలా ఎంతో మందికి కరోనా ఉన్నా తెలియకుండా పరీక్షలు చేయించుకోకుండానే చనిపోతున్నారు. ఆ మరణాలు లెక్కలోకి కూడా రావడం లేదు.
తాజాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 1.65లక్షలు దాటింది. కానీ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య అధికారిక సంఖ్య కంటే రెట్టింపు కంటే ఎక్కువే ఉంటుందని ఆరోగ్య నిపుణులు - పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 85శాతం కరోనా వైరస్ ఇన్ ఫెక్షన్లు నమోదు చేయడం లేదని వారు అంటున్నారు. భారత్ లో రాష్టాల్లో గ్రామీణ ప్రాంతాల్లో చనిపోయిన ప్రజల బహిరంగ డేటా అందుబాటులో లేదని నివేదికలు అందుతున్నాయి.
*చైనా ఇటీవల కరోనా మరణాలను సవరించింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం చైనాలో కరోనా మరణాలను చైనా చాలా తక్కువ చూపించిందని ఆరోపించారు. చాలా మరణాలను చైనా దాచేసిందన్నారు. చైనా దాదాపు 50శాతం తక్కువగా చూపించిందని ట్రంప్ ఆరోపించాడు. వూహాన్ లో మరణాల సంఖ్య తాజాగా 1290మంది చేర్చడం అనుమానాలకు కారణమైంది.
*ఇక న్యూయార్క్ నగరంలో కూడా మరణాల సంఖ్యను 3778కు సవరించారు. ఒకే రోజులో మొత్తం మరణాలు 55శాతానికి పెరగడం గమనార్హం. వీరంతా ఆస్పత్రుల్లో చావలేదని.. ఇంట్లోనే కరోనా కారణంగా చనిపోయారని తెలిపింది. అందుకే లెక్కలోకి మొదట తీసుకోలేదన్నారు.
*ఇటలీలోని లాంబార్డ్ లోనూ మొదట 2060 మరణాలను చూపెట్టి తాజాగా సవరించి 4500మరణాలుగా ఇటలీ ప్రకటించడం గమనార్హం.
*స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లోనూ మొదట మరణాలు 3752గా పేర్కొన్నారు. ఇప్పుడు 7500గా తెలిపారు.
ఇంట్లో చనిపోతున్న వారిలో ఎక్కువ మందికి కరోనా పరీక్షలు నిర్వహించలేదు. వారి చనిపోతే డైరెక్ట్ గా ఖననం చేస్తున్నారు. ఇప్పుడు వారిని గుర్తించి మరణాల సంఖ్యను ఆయా దేశాలు సవరిస్తున్నాయి.
చైనాలో అయితే చాలా మంది కరోనా కారణంగా చనిపోయి ఆయా ఇళ్లల్లో బయట చనిపోయారట.. వూహాన్ లో రోడ్లపై శవాలను పడేశారట.. వాటిని చైనా దేశం లెక్కించలేదు. ఇక కరోనా ఆస్పత్రుల్లో మరణించిన వారిని కనీసం వారి బంధువులకు కూడా ఇవ్వకుండా ఖననం చేసింది. ఇలా లెక్కకు మిక్కిలి మరణాలను చైనా సహా పాశ్చాత్య దేశాలన్నీ దాచేశాయని నిపుణులు చెబుతున్నారు.