Begin typing your search above and press return to search.
ప్రపంచవ్యాప్తంగా ఈ 12 దేశాలలో ఒక్క కరోనా కేసు లేదు
By: Tupaki Desk | 20 July 2020 11:30 PM GMTకరోనా ప్రపంచాన్ని చుట్టేసింది. అందరినీ ఆవహించింది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రతీదేశంలోనూ ఉనికిని చాటింది. ప్రజలకు నిద్రలేకుండా చేస్తూ ఇప్పుడు ప్రపంచసమస్యగా మారింది. అందరూ దీనిపై పోరాడుతున్నారు. కానీ ఈ 12 దేశాల వారు మాత్రం కాదు. వారు హాయిగా బతుకుతున్నారు. అక్కడికి కరోనా దరిచేరలేదు. ఇందులో మెజార్టీ మహాసముద్రంలోని ద్వీపాలు కాగా.. కొన్ని అస్సలు పర్యాటకం లేని మారుమూల దేశాలు కావడం గమనార్హం.
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచంలోని దాదాపు 215 దేశాలు, స్వతంత్ర ద్వీపాలకు విస్తరించిందని వరల్డ్ మీటర్ల డేటా తెలిపింది. దీనికారణంగా 6 లక్షల మంది చనిపోగా.. కోటి 44 లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రతీరోజు 2లక్షల 40వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. 5వేల మంది మరణిస్తున్నారు.
ఇక అమెరికా, బ్రెజిల్, భారత్ లలో వేగంగా వ్యాపిస్తోంది. అయితే ఇప్పటికీ కొన్ని దేశాల్లో కరోనా లేకపోవడం గమనార్హం. కరోనా మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ఈ సమయంలో కరోనా వైరస్ తో ఒక్క కేసు కూడా నమోదు చేయని దేశాలు ఈ 12 ఉన్నాయి.
1.మైక్రోనేషియా
2. వనాటు
3. టువాలు
4.తుర్కెమెనిస్తాన్
5.టోంగా
6.సోలమన్ దీవులు
7. సమోవా
8.పలావు
9. ఉత్తరకొరియా
10.నౌరు
11. మార్షల్ దీవులు
12. కిరిబాటి
ఇందులో తుర్కెమెనిస్టాన్, ఉత్తరకొరియా మాత్రమే ఆసియా ఖండంలో చుట్టుపక్కల దేశాలతో కలిసి ఉన్నాయి. వీటిల్లో కేసులు ప్రబలకపోవడానికి కారణం.. ఉత్తరకొరియాలో నియంత కిమ్ జాంగ్ ఉండడం.. అక్కడికి ఎవరూ వెళ్లకపోవడమే కారణం.. అక్కడ సోకినా బయటకు తెలియకపోవడం.. ఇక సోవియట్ పాత దేశం తుర్కెమెనిస్తాన్ లోనూ కేసులు నమోదు కాలేదు. ఇక మిగతా దేశాలన్నీ మహాసముద్రంలో ఉండడంతో కేసులు నమోదుకావడం లేదు.