Begin typing your search above and press return to search.

ఓవర్ నైట్ ఫేమ‌స్ అయిన పేర్లు.. ఓఆర్ ఓపీ... ఓడోమాస్

By:  Tupaki Desk   |   29 Jan 2019 2:30 PM GMT
ఓవర్ నైట్ ఫేమ‌స్ అయిన పేర్లు.. ఓఆర్ ఓపీ... ఓడోమాస్
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు టైం ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న కొద్దీ రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. ఒక‌రిపై ఒక‌రు మాట అనుకునేందుకు పోటాపోటీ ప‌డుతున్నారు. అంతేనా.. ప్ర‌త్య‌ర్థికి పంచ్ ఇచ్చేందుకు ఏ చిన్న అవ‌కాశం ల‌భించినా అస్స‌లు వ‌ద‌ల‌టం లేదు. నాటుప‌ద్ద‌తిలోనూ.. రొడ్డుకొట్టుడు స్టీరియో టైపు విమ‌ర్శ‌ల‌కు భిన్నంగా.. అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేందుకు తెగ ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఎన్నిక‌ల సీజ‌న్ కావ‌టంతో ఎవ‌రికి వారు త‌గ్గ‌ని ప‌రిస్థితి. ఇటీవ‌ల విడుద‌లైన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల్లో మూడు రాష్ట్రాల్లో అధికార‌ప‌క్ష‌మైన బీజేపీ బొక్కాబోర్లా ప‌డ‌టంతో మోడీషాల‌కు క‌ళ్లు విప్పారాయ‌ని చెబుతారు. అప్ప‌టివ‌ర‌కూ గెలుపు విష‌యంలో విప‌రీత‌మైన ధీమాను ప్ర‌ద‌ర్శించిన మోడీ షాల‌కు ఆయా రాష్ట్రాల ప్ర‌జ‌లు ఇవ్వాల్సిన షాక్ ను ఇచ్చార‌ని చెప్పాలి.

ఏ మాత్రం ఊహించ‌ని ఈ షాక్ నుంచి తేరుకోవ‌ట‌మే కాదు.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యానికి అవ‌స‌ర‌మైన వ్యూహాన్ని చ‌క‌చ‌కా మార్చుకున్నార‌ని చెప్పాలి. అంతేకాదు.. అగ్ర‌వ‌ర్ణాల‌కు రిజ‌ర్వేష‌న్లు మొద‌లు.. భార‌త‌ర‌త్న పుర‌స్కారాల వ‌ర‌కూ ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌ద‌ల‌కుండా వెళుతున్న మోడీ బ్యాచ్.. త‌మ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ పైనే విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధిస్తున్నారు.
మోడీషా వేస్తున్న ఎత్తుల్ని గ‌మ‌నిస్తున్న కాంగ్రెస్ వ్యూహ‌బృందం పైఎత్తులు వేసే క్ర‌మంలో ప్రియాంక‌ను క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌ని డిసైడ్ చేశారు.ఈ ఎత్తును ఊహించ‌ని మోడీషా ప‌రివారం డీప్ షాక్ కు గురైన‌ట్లుగా చెప్పాలి. ప్రియాంక క్రియాశీల రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌న్న ప్ర‌క‌ట‌న వెలువ‌డిన వెంట‌నే.. క‌మ‌ల‌నాథుల నుంచి వ‌చ్చిన రియాక్ష‌న్ల‌ను చూస్తే విష‌యం ఇట్టే అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి. ప్రియాంక ఎంట్రీపై కొంద‌రు బీజేపీ నేత‌లు మ‌రీ ముత‌క‌గా స్పందించిన తీరు ఎబ్బెట్టుగా మారింది.

ఇదిలా ఉంటే.. ప్రియాంక ఎంట్రీని త‌ట్టుకోలేని బీజేపీ చీఫ్ అమిత్ షా సైతం నోరు విప్పిన ప‌రిస్థితి. కాంగ్రెస్ ఓఆర్ ఓపీగా మారిపోయింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మొద‌టి ఏడాదిలోనే ఒన్ ర్యాంక్ ఒన్ పెన్ష‌న్ హామీని అమ‌లు చేసింద‌ని.. కాంగ్రెస్ మాత్రం దేశానికి ఓఆర్ ఓపీను ఇచ్చింద‌ని ఎట‌కారం ఆడేశారు. ఏందీ ప‌దానికి అర్థం అంటే.. ఓన్లీ రాహుల్.. ఓన్లీ ప్రియాంక అంటూ కాంగ్రెస్ పార్టీ స్వ‌రూపాన్ని ఒక్క లైనులో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. బీజేపీ నేత‌లు మొద‌లెట్టిన దాడికి కాంగ్రెస్ రియాక్ట్ కావ‌టానికి బ‌దులుగా.. వారికి అత్యంత స‌న్నిహితుడైన నేష‌న‌ల్ కాన్ప‌రెన్స్ నేత ఒమ‌ర్ అబ్దుల్లా రియాక్ట్ అయ్యారు.

షా విమ‌ర్శ‌ను ఘాటు రిటార్ట్ ఇస్తూ.. మిగితా దేశం మొత్తం ఓడోమాస్ (ఓడీఓఎంఓఎస్)తో తీవ్రంగా బాధ ప‌డుతోంద‌న్న ఆయ‌న‌.. ఓడోమాస్ కు అర్థం ఏమిటో త‌న ట్వీట్ లో చెప్పేశారు.. ఓవ‌ర్ డోస్ ఆఫ్ ఓన్లీ మోడీ ఓన్లీ షా అంటూ షాకు కౌంట‌ర్ ఇచ్చారు. ఇలా ఒక‌రి మీద ఒక‌రు పోటాపోటీగా చేసుకుంటున్న ఈ విమ‌ర్శ‌ల పుణ్య‌మా అని.. ఓవర్ నైట్ లో ఈ రెండు ప‌దాలు అంద‌రి నోటా నానుతున్న ప‌రిస్థితి. ఈ లెక్కన ఎన్నిక‌లు ముగిసే నాటికి ఈ త‌ర‌హాలో మ‌రెన్ని కొత్త ప‌దాలు పుట్టుకొస్తాయో?