Begin typing your search above and press return to search.

సింహల మలానికి ఎగబడి కొంటున్న ఆ దేశస్థులు ..ఎందుకంటే

By:  Tupaki Desk   |   21 Aug 2020 1:30 AM GMT
సింహల మలానికి ఎగబడి కొంటున్న ఆ దేశస్థులు ..ఎందుకంటే
X
ఎక్కడైనా పులిగోర్లు , పులి చర్మం కొంటారని తెలుసు కానీ , సింహాల మలాన్ని కూడా కొంటారా? అని ఆలోచిస్తున్నారా ! అయినా సింహాల మలాన్ని కొని ఏంచేస్తారు.. ఇంటికి తీసుకోని వెళ్లి తింటారా ? అని అనుమాన పడుతున్నారా. ఈ సందేహాలకు సమాధానంకావాలంటే జర్మనీలో క్రోనే సర్కస్ కంపెనీవాళ్లు మొదలుపెట్టిన ఈ కొత్త బిజినెస్ గురించి తెలుసుకోవల్సిందే.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ముంచీలో గల క్రోనే సర్కర్. కరోనా వల్ల నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. గత కొన్ని నెలలుగా సర్కస్ ప్రదర్శనలు జరగకపోవడం వల్ల అందులోని ఉద్యోగులకి తినడానికి తిండి కూడా లేదు. అంతేగాక.. సర్కస్‌లో ఉండే జంతువులకు సైతం ఆహారం పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఏం చేయాలా అనే ఆలోచిస్తున్న సమయంలో ఓ ఉద్యోగి.. సింహం మలాన్ని అమ్ముకుందాం అని జోక్ చేశాడు. అతడు ఆ మాటను సరదాగానే అన్నాడు. కానీ, సర్కస్ నిర్వాహకులు మాత్రం దీన్ని సీరియస్ ‌గా తీసుకున్నారు.

దీనితో , సింహం మలాన్నీ జాడీల్లో పెట్టి అమ్మకాలు మొదలుపెట్టారు. రండి బాబు.. రండి.. మా వద్ద ఫ్రెష్ సింహం పూప్ లభిస్తోంది. వచ్చి కొనండి.. మీ మిత్రులకు బహుమతిగా ఇవ్వండి అని ప్రచారం చేశారు. దీనితో కొంచెం క్రేజీగా ఉండటంతో జనాలు సింహం మలాన్ని కొనుగోలు చేయడానికి క్యూకట్టారు. దీనికి డిమాండ్ పెరగడంతో సర్కస్ వాళ్లు మలం గుర్తు తో ప్రత్యేకంగా ఓ దుకాణాన్ని కూడా ప్రారంభించారు. అందులో సింహం మలంతో కూడిన జాడీలను వరుసగా పేర్చి కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ సర్కస్ ‌లో మొత్తం 26 సింహాలు, పులులు ఉన్నాయి. ఒక్కో సింహం మలం జాడీని 5 యూరోలు ( మన కరెన్సీ లో రూ.445)లకు అమ్ముతున్నారు. ఇందులో ఎలాంటి ప్రత్యేకతలు లేవు. అయితే, ప్రజలు మాత్రం వాటిని తమ స్నేహితులకు గిఫ్టుగా పంపి ఆటపట్టేందుకు వాటిని కొనుగోలు చేస్తున్నారు. కొందరు మాత్రం ఎరువుగా వాడేందుకు కొంటున్నామని, ఇది క్రిమీసంహాకరంగా పనిచేస్తుందని వాళ్లు చెబుతున్నారు.

ఈ సరికొత్త ప్రొడక్ట్ గురించి ఇప్పుడు ఆన్‌ లైన్ ‌లో కూడా చర్చ మొదలైంది. దీంతో సర్కస్ సంస్థకు భారీగా ఆదాయం వస్తుంది. అయితే, కొందరు ఈ వ్యాపారాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. సింహం మలంలో బ్యాక్టీరియా ఉంటుందని, అది ప్రజారోగ్యానికి హానికరమని ఆరోపిస్తున్నారు. వెంటనే సింహం మలాన్ని విక్రయించే సంస్థపై చర్యలు తీసీకోవాలని, అమ్మకాలను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, జనం మాత్రం దీన్ని తాము సరదాగా కోసమే కొనుగోలు చేస్తున్నామని, దీనివల్ల సర్కస్ సంస్థవారికి ఆర్థిక చేయుత లభించడమే కాకుండా.. ఆ జంతువులకు మంచి ఆహారాన్ని అందించగలరని అంటున్నారు.