Begin typing your search above and press return to search.
ఇద్దరు పిల్లలు సహా దంపతులు నదిలో దూకి ఆత్మహత్య
By: Tupaki Desk | 2 Aug 2021 7:31 AM GMTతూర్పు గోదావరి జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి భార్యాభర్తలు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలోని మామిడికుదురు మండలం మొగలికుదురులో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బైక్ పై చంచినాడ బ్రిడ్జి వద్దకు చేరుకున్న దంపతులు దాని పైనుంచి పిల్లలతో సహా వశిష్ఠ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్రిడ్జిపై ఉన్న బైక్, చిన్నారుల దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబంలో తలెత్తిన మనస్పర్థలే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే, కొందరు వ్యక్తులు తమను దారుణంగా మోసం చేశారని, వారి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు భార్య పేరుతో ఉన్న లేఖ, ఆడియో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి.
వివాహేతర సంబంధాలతో జీవితాలు ఓ వైపు నాశనం అవుతున్నా కూడా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. తూర్పు గోదావరి జిల్లా మొగలికుదురుకు చెందిన భార్య భర్తలు , ఇద్దరు పిల్లలు కలిసి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో భర్త, కూతురు మృతదేహాలు ఆదివారం పోలీసులకు లభించగా తల్లి, కుమారుడి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట గ్రామానికి చెందిన మహిళకి ,తూర్పుగోదావరి జిల్లా మొగలికుదురుకు చెందిన యువకుడి తో ఆరేళ్ల కిందట వివాహమైంది. తాపీ పని చేసుకునే ఆ యువకుడు రెండేళ్ల కిందట డబ్బు సంపాదించాలనే లక్ష్యం తో గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో ఆ మహిళకి కు కేశవదాసుపాలేనికి చెందిన మరో వ్యక్తి తో తో వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి మహిళ నుండి బంగారం, నగదు కూడా తీసుకున్నాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో పెద్దల సమక్షంలో రాజీ ప్రయత్నాలు జరిగాయి. కొంత బంగారం, నగదు వెనక్కి వచ్చాయి. దీంతో ఆ మహిళ అత్తమామలు, పిల్లల్ని వారి దగ్గర ఉంచుకుని కోడలిని పుట్టింటికి పంపేశారు. ఇదిలా ఉండగా గత నెల 20న గల్ఫ్ నుంచి వచ్చిన ఆమె భర్త కు జరిగిన విషయం తెలియడంతో మానసికంగా కుంగిపోయాడు. మద్యానికి బానిస కావడంతో తల్లిదండ్రులు అతనిని కేశవదాసుపాలెంలో ఉన్న పెద్దక్క ఇంటికి పంపారు. అక్కడ నుంచి ఆ మహిళ భర్త ఈ నెల 29న భార్యకు ఫోన్ చేశాడు. పాలకొల్లు మండలం వెలివెలలోని తన పెద్దమ్మ ఇంటి వద్ద ఉన్నానని భార్య చెప్పడంతో పిల్లలతో కలిసి అక్కడకు వెళ్లాడు. జరిగిన సంగతి మరచిపోయి కలిసి బతుకుదామని చెప్పడంతో ఆ మహిళ కూడా ఒప్పుకుంది.
శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో మొగలికుదురుకు బయలుదేరారు. చించినాడ వంతెన మీద బైక్ పెట్టి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు తండ్రికి సంధ్య వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ చేసింది. డాడీ.. నేను ఒకడి చేతిలో మోసపోయాను. నా జీవితాన్ని నాశనం చేశాడు, ఫలితంగా నేను, నా భర్త, పిల్లలు ఇద్దరితో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నాం, చనిపోయే ముందు పెట్టిన వాయిస్ మెసేజ్ ఇది. ఘటనా స్థలిలో బట్టలు, సూసైడ్ లెటర్ ఉన్నాయి. సూసైడ్ లెటర్ ను స్వాధీనం చేసుకున్న ఎలమంచిలి పోలీసులు.. ఆ లేఖ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.