Begin typing your search above and press return to search.

విజయవాడ లో ఒక్క రోజు తేడాతో దంపతుల మృతితో హై టెన్షన్‌

By:  Tupaki Desk   |   31 March 2020 4:14 PM GMT
విజయవాడ లో ఒక్క రోజు తేడాతో దంపతుల మృతితో హై టెన్షన్‌
X
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా లాక్‌ డౌన్‌ ను కఠినంగా అమలు చేస్తున్నా కూడా కరోనా పాజిటివ్‌ ల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఏపీలో కరోనా పాజిటివ్‌ ల సంఖ్య ఒక్కసారిగా 40 కి చేరుకోవడంతో ప్రభుత్వ యంత్రాంగం ఇంకా జనాలు భయాందోళనకు గురి అవుతున్నారు. ప్రస్తుతం నమోదు అయిన కరోనా పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువ శాతం దిల్లీలో నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన మతపరమైన సమావేశంకు హాజరు అయిన వారు ఉన్నారు.

తాజాగా విజయవాడ పాతబస్తీకి చెందిన జంట ఒక్క రోజు వ్యవధిలో మృతి చెందడటం జరిగింది. ఆ జంట ఇటీవల దిల్లీ వెళ్లి వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన సమావేశంలో వారు హాజరు అయినట్లుగా చెబుతున్నారు. వారికి ఇంతకు ముందే అనారోగ్య సమస్యలు ఉన్న కారణంగా కరోనా పాజిటివ్‌ అని తేలే లోపే చనిపోయి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వారిద్దరి శాంపిల్స్‌ ను కూడా కరోనా టెస్టు కోసం ల్యాబ్‌ కు పంపించారు.

వారు ఖచ్చితంగా కరోనా పాజిటివ్‌ అవ్వడం వల్లే మృతి చెందారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా ఆ కుటుంబంతో కాంటాక్ట్‌ పెట్టుకున్న వారి వివరాలను అధికారులు సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆ దంపతుల కుమార్తెలు ఇంకా బంధువులను క్వారెంటైన్‌ కు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడ పాతబస్తీతో పాటు మొత్తం విజయవాడ కూడా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఇంకా పలువురు కూడా నిజాముద్దీన్‌ ప్రాంతంలోని జరిగిన మతపరమైన కార్యక్రమంకు వెళ్లి వచ్చిన వారు ఉన్నారని వారిని గుర్తిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.