Begin typing your search above and press return to search.
కరోనాకు సొంత వైద్యం.. దంపతుల మృతి
By: Tupaki Desk | 25 March 2020 7:50 AM GMTకరోనా వైరస్ నివారణకు మందు లేదు.. కానీ దాని నివారణకు మలేరియాకు వేసే మందు క్లోరోక్విన్ పాస్పేట్ వాడాలని ఇప్పటికే ప్రపంచ దేశాలు నిర్ణయిస్తున్నాయి. కరోనాను ఆ మందు కొంత తగ్గిస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ కూడా ప్రకటించారు. అయితే కరోనా పాజిటివ్ ఉన్న దంపతులు వాడి వారి ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. వారు సొంత వైద్యం చేసుకుని చివరకు మృతిచెందారు. ఈ సంఘటన అమెరికాలోని అరిజొనలోంలో చోటుచేసుకుంది.
ఆ ప్రాంతంలోని 60 ఏళ్లు దాటిన దంపతులు కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. దీంతో వారు ఆస్పత్రిలో చేరకుండా సొంత వైద్యం చేసుకోవాలని నిర్ణయించుకుని ఇంటికే పరిమితమయ్యారు. దీంతో వారు వారికి తోచిన మందులు వాడారు. మొదట చేపల తొట్టెలను శుభ్రం చేసే ద్రావణం తాగారు. అనంతరం కరోనా నివారణకు క్లోరోక్విన్ పాస్పేట్ మందు పని చేస్తుందని కొందరు ప్రకటించడంతో ఆ దంపతులు దాన్ని తీసుకున్నారు. అయితే ఆ మందు వారిపై దుష్ప్రభావం చూపించింది. దీంతో మొదట ఆమె భర్త మృతిచెందాడు. ఆమె తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతూ చివరకు ఆమె కూడా మృతిచెందింది. దీంతో క్లోరోక్విన్ పాస్పేట్ మందు ప్రాణం తీసిందని అమెరికాలో విమర్శలు వస్తున్నాయి. సొంత వైద్యం చేసుకోవడంతోనే వారు మృతిచెందారని వైద్యులు తెలిపారు. కరోనా పాజిటివ్ ఉన్నప్పుడే వారు ఆస్పత్రికి వచ్చి ఉంటే వారు కోలుకునే అవకాశం ఉండేదని వైద్య అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికైనా కరోనా పాజిటివ్ ఉన్నవారు, కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆస్పత్రిలో చేరాలని సూచిస్తున్నారు.