Begin typing your search above and press return to search.
హిందూ-ముస్లిం పాస్ పోర్టు..ఓ ట్వీట్ కథ
By: Tupaki Desk | 21 Jun 2018 10:06 AM GMTఓ హిందూ, ముస్లిం ప్రేమ జంటకు అవమానం ఎదురైంది. తమకు పాస్ట్ పోర్టు కార్యాలయంలో ఎదురైనా చేదు అనుభవాన్ని కేంద్ర విదేశాంగ శాఖమంత్రి సుష్మ స్వరాజ్ కు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసింది ఆ యువతి. లక్నో పాస్ పోర్టు అధికారి ఎలా అవమానించాడో వివరించింది.
ఉత్తరప్రదేశ్ కు చెందిన ముస్లిం యువకుడు - హిందూ యువతి పెళ్లి చేసుకున్నారు. ఆ ముస్లిం యువకుడి పేరు మహ్మద్ అనాస్ సిద్ధిఖీ - సిద్దికి 2007లో తన్వి అనే హిందూ యువతని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ నోయిడాలోని ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగులుగా చేస్తున్నారు. వీరికి ఆరేళ్ల పాప ఉంది. వీరిద్దరూ పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వికాస్ అనే అధికారి తన్వి - సిద్ధిఖీలపై మండిపడుతూ.. మీ వివాహం చెల్లదని చెప్పారు. ‘నీవు హిందుమతంలోకి మారాలని’ సిద్ధిఖీకి స్పష్టం చేశారు.
ఇలా లక్నో పాస్ పోర్టు కార్యాలయంలో తమకు జరిగిన అవమానాన్ని తన్వి సుష్మా స్వరాజ్ తో పంచుకుంది. అంతేకాదు.. ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. తమ పాస్ట్ పోర్టు దరఖాస్తులను సదురు అధికారి హోల్డ్ లో పెట్టాడని తన్వి విన్నవించింది.
తన్వి పోస్టుకు స్పందించిన సుష్మాస్వరాజ్ సదురు అధికారి వికాస్ ను బదిలీ చేశారు. మరో వైపు దీనిపై ఎక్స్ టర్నల్ ఎఫైర్ మినిస్టర్ సెక్రెటరీ డీఎం ములాయ్ కూడా స్పందించారు. ఆ జంటకు ఇబ్బంది కలిగినందుకు క్షమాపణలు చెప్పారు. లక్నో కార్యాలయంలో సమాచారం తెలుసుకొని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలా ఎప్పుడు ట్విట్టర్ లో యాక్టివ్ ఉండే కేంద్రమంత్రి సుష్మ మరోసారి ఓ జంట సమస్యను తీర్చి వార్తల్లో నిలిచారు.