Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ అంగ‌ట్లో ఆంత‌రంగిక వీడియోలు!

By:  Tupaki Desk   |   4 April 2018 8:04 AM GMT
ఆన్ లైన్ అంగ‌ట్లో ఆంత‌రంగిక వీడియోలు!
X
ఈ హైటెక్ యుగంలో ఇంట‌ర్నెట్ - మొబైల్ డేటాలు కారు చౌక‌గా ల‌భిస్తుండంతో ఉప‌యోగాలు ఎన్ని ఉన్నాయో....న‌ష్టాలు కూడా అన్నే ఉన్నాయి. ఆధునిక యుగంలో అందుబాటులోకి వ‌చ్చిన టెక్నాల‌జీని స‌ద్వినియోగం చేసుకొనే వారు కొంద‌రైతే....దానిని విచ్చ‌ల‌విడిగా వాడి దుర్వినియోగ‌ప‌రిచే వారు మ‌రెంద‌రో. దూర ప్రాంతాల‌లో ఉన్న కుటుంబ స‌భ్యుల‌తో వీడియో కాల్ లో మాట్లాడే ఉద్దేశంతో ప‌లు వీడియో కాలింగ్ యాప్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే, కొంద‌రు దానిని మిస్ యూజ్ చేస్తున్నారు. గుట్టు చ‌ప్పుడు కాకుండా నాలుగు గోడ‌ల మ‌ధ్య ఉండ వ‌ల‌సిన శృంగార వ్య‌వ‌హారాల‌ను ఆన్ లైన్ లో పెట్టేస్తున్నారు. విలాసం కోసం త‌మ వ్య‌క్తిగ‌త వీడియోల‌ను ఆన్ లైన్ లో పెట్టేవారు కొంద‌రైతే వ్యాపారం కోసం `ఆన్ లైన్` అంగ‌ట్లో పెట్టేవారు మ‌రి కొంద‌రు. తాజాగా, ఈ వ్య‌వ‌హారాల్లో పెళ్లి కాని యువ‌తీయువ‌కులే కాకుండా....దంపతులు కూడా పాలు పంచుకోవ‌డం సంచ‌ల‌నం రేపుతోంది.

బెడ్రూంలో యువతీయువ‌కులు - దంప‌తులు త‌మ వ్య‌క్తిగ‌త వీడియోల‌ను రికార్డు చేసి త‌మ స‌న్నిహితులకు పంప‌డం వంటి వంటి వ్య‌వ‌హారాల గురించి వింటూనే ఉన్నాం. కొన్ని సార్లు హోట‌ల్స్ వంటి చోట్ల యువ‌తీయువ‌తులు - దంప‌తులు స‌న్నిహితంగా ఉన్న వ్య‌క్తిగ‌త వీడియోల‌ను సీక్రెట్ గా స్పై కెమెరాల‌తో రికార్డు చేసి ఆన్ లైన్ లో పెట్టి సొమ్ము చేసుకోవ‌డం వంటి ఘ‌ట‌న‌లు అనేకం. అయితే, తాజాగా, కొంద‌రు యువ‌తీయువ‌కులు మాత్ర‌మే కాకుండా దంప‌తులు కూడా స్వ‌చ్ఛందంగా త‌మ అంత‌రంగిక వీడియోల‌ను ఇత‌రుల‌కు షేర్ చేసి డ‌బ్బు సంపాదిస్తున్న ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌చ్చాయి. త‌న భార్య‌కు తెలియ‌కుండా ఆమె న‌గ్న వీడియోలు రికార్డు చేసి వేరేవారికి చేర‌వేయ‌డంతో హైద‌రాబాద్ కు చెందిన టెకీ అరెస్ట‌యిన సంగ‌తి తెలిసిందే. ఆ టెకీకి స‌ద‌రు వ్య‌క్తి భార్య న‌గ్న‌వీడియోలు కూడా చేర‌డం కొస‌మెరుపు. ప‌ర‌స్ప‌రం ఇరువురు భ‌ర్త‌లు - క‌పుల్స్ అంగీకారంతో (స్వాపింగ్) లైవ్ స్ట్రీమింగ్ చేసిన ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి. ఇటువంటి కార్య‌క‌లాపాల‌కు ఆన్ లైన్ ర్యాండ‌మ్ చాట్ సైట్లు - డేటింగ్ వెబ్ సైట్లు వేదిక‌ల‌వుతున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు బెంగుళూరులో ఉండే ఓ యువ‌తి త‌న ప్రైవేటు వీడియోను లైవ్ స్ట్రీమింగ్ లో చూపించేందుకు హైద‌రాబాద్ లోని యువ‌కుడితో ఒప్పందం చేసుకుంటుంది. ఇద్ద‌రూ...చాటింగ్ లో అనుకున్న స‌మ‌యానికి స‌ద‌రు యువ‌కుడు....ఆ యువ‌తి ఆన్ లైన్ వాలెట్ కు డ‌బ్బు పంపుతాడు.

ఆ త‌ర్వాత ఆ యువ‌తి ప్రైవేటు(న‌గ్న‌) వీడియోను....కొంత‌సేపు వీక్షించే అవ‌కాశం ఆ యువ‌కుడికి క‌లుగుతుంది. ప్ర‌స్తుతం గంట‌కు రూ.1500 నుంచి రూ. 5000 వ‌ర‌కు చార్జ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఒంట‌రిగా నివ‌సించే కొంద‌రు గృహిణులు కూడా ఈ త‌ర‌హా వెబ్ క్యామ్ షోల‌తో డ‌బ్బులు సంపాదిస్తున్నారు. అయితే, ఆశ్చ‌ర్య‌క‌రంగా కొంద‌రు దంప‌తులు కూడా ఈ త‌ర‌హా ఆన్ లైన్ శృంగారం లైవ్ స్ట్రీమింగ్ చేసి డ‌బ్బులు సంపాదించ‌డం క‌ల‌వ‌రపెడుతోంది. కేవలం డ‌బ్బు సంపాద‌నే ల‌క్ష్యంగా నైతిక విలువ‌లు, సంబంధాలు మ‌రిచి త‌మ ప‌రువును ఆన్ లైన్ లో పెడుతున్నారు. కేవ‌లం ఒక వెబ్ క్యామ్ - మైక్ - కంప్యూట‌ర్ లేదా ల్యాప్ ట్యాప్ ఉంటే చాలు.....గంట‌కు దాదాపు 2-5 వేలు సంపాదించేసే అవ‌కాశం ఉండ‌డంతో చాలా మంది ఈ త‌ర‌హా చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. మామూలుగా సెక్స్ చేస్తే ఒక రేటు....క‌స్టమ‌ర్ కోరుకున్న‌ట్లు చేస్తే మ‌రో రేటును వ‌సూలు చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే, వీరిలో అధిక భాగం చ‌దువుకున్న వారు - మంచి ఉద్యోగాల‌లో ఉన్న వారు ఉండ‌డం గ‌మ‌నార్హం. బెంగుళూరు - హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల‌లో కూడా ఈ త‌ర‌హా సెక్స్ లైవ్ స్ట్రీమింగ్ క‌ల్చ‌ర్ పెరిగిపోతోంది. ఈ త‌ర‌హా వ్య‌వ‌హారాల వ‌ల్ల మాన‌వ సంబంధాలు మ‌రింత దిగ‌జారుస్తున్నాయ‌ని మాన‌సిక నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.