Begin typing your search above and press return to search.

కదులుతున్నకారులో సెక్స్ చేస్తూ చచ్చిపోయాడు

By:  Tupaki Desk   |   25 Feb 2016 4:24 AM GMT
కదులుతున్నకారులో సెక్స్ చేస్తూ చచ్చిపోయాడు
X
తప్పలు చేయొచ్చు కానీ ఘోరమైన తప్పుల్ని అసలు చేయకూడదు. రొమాంటిక్ గా గడపాలన్న పిచ్చపీక్ స్టేజ్ లోకి వెళితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయం తాజా ఘటన గురించి తెలిస్తే ఇట్టే అర్థమవుతుంది. ఫాంటసీ ఆలోచనలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారు.. ప్రాణాల్ని సైతం పణంగా పెట్టాల్సి ఉంటుందన్న విషయం మరోసారి రుజువైంది.

వేగంగా వెళుతున్న కారును డ్రైవ్ చేస్తూ.. ప్రియురాలితో సెక్స్ చేయాలన్న దరిద్రపుగొట్టు ఆలోచన ఒక యువకుడి ప్రాణాల్ని తీసింది. నిజానికి ఇలాంటి పిచ్చలు ప్రాశ్చాత్య దేశాల్లో కనిపిస్తుంటాయి. అందుబాటులోకి వచ్చిన సమాచారం విప్లవంతో ఇలాంటి దరిద్రపుగొట్టు ఐడియాల్ని అప్పుగా తీసుకొని ఆచరణలో పెట్టే ప్రయత్నంలో విలువైన ప్రాణాల్నే పోగొట్టుకున్న ఘటన మనదగ్గరే చోటు చేసుకుంది.

లవ్వర్ ను సొంతూరిలో దింపి రావాలన్న ఆలోచనతో బయలుదేరిన ప్రియుడు.. కారులో వేగంగా డ్రైవ్ చేస్తూ.. ఆమె సెక్స్ చేయటం మొదలు పెట్టిన ఉదంతం ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్.. పురాన్ పూర్ హైవే మీద చోటు చేసుకుంది. పురాన్ పూర్ కు చెందిన 24 ఏళ్ల అమ్మాయి ఫిలిబిత్ ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటోంది. అక్కడే ఆమెకు 31 ఏళ్ల యువకుడితో స్నేహం ప్రేమగా మారింది. అర్జెంట్ పని కోసం ప్రియురాలిని వారి సొంతూరులో దింపేందుకు కారులో బయలుదేరారు. వారి ప్రయాణం మధ్యలో ఏమైందో కానీ.. ఒక చేత్తో కారు డ్రైవ్ చేస్తూ మరోవైపు ఇద్దరు శృంగారం చేయటం మొదలెట్టారు.

దీంతో.. డ్రైవింగ్ మీద పట్టు కోల్పోయిన సదరు యువకుడు ఎదురుగా వస్తున్న ట్రక్కు మీదకు కారును పోనిచ్చేశాడు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కారు దగ్గరకు వచ్చి.. కారులోని బాధితులను చూసిన వారి నోట మాట రాని పరిస్థితి. ఇద్దరి ఒంటి మీద నూలుపోగు లేకుండా ఉండటం.. వారు ఇరుక్కుపోయిన వైనం చూసి విస్మయం చెందిన పరిస్థితి. ఈ ఘటనలో ప్రియుడి ప్రాణాలు అక్కడికక్కడే పోతే.. ప్రియురాలికి పెద్ద దెబ్బలే తగిలాయి. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఎంత మోజు అయితే మాత్రం.. మరీ ఇంత కక్కుర్తి అవసరమా..?