Begin typing your search above and press return to search.
జగన్ కు షాక్.. బెయిల్ రద్దు పిటీషన్ పై కోర్టు సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 27 April 2021 6:01 PM GMTఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటీషన్ ను విచారణకు స్వీకరిస్తూ సీబీఐ కోర్టు నిర్ణయించింది. సీబీఐ కోర్టులో నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఈ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది. పిటీషన్ అర్హతపై కోర్టులో వాదనలు వినిపించారు. జడ్జి ఇవాళా విచారణ జరపాలా? లేదా అన్నదానిపై తీర్పును వెలువరించారు. ఈ విషయాన్ని ఎంపీ రఘురామకృష్ణం రాజు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ఏపీ సీఎం జగన్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 11 చార్జిషీట్లను సీబీఐ నమోదు చేసిందని ఎంపీ రఘురామ పిటీషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రతీ చార్జీషీట్ లో జగన్ ఏ1గా ఉన్నారని పేర్కొన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండాలని ఈ పిటీషన్ వేసినట్టు పేర్కొన్నారు. జగన్ పై నమోదైన కేసులను త్వరగా విచారించాలని పిటీషన్ లో కోరానన్నారు.
కాగా తాను వేసిన జగన్ బెయిల్ రద్దు పిటీషన్ ను సీబీఐ కోర్టు విచారణ కు స్వీకరించిందని ఎంపీ రఘురామ తెలిపారు. జగన్ నిర్ధోషిగా బయటపడాలన్నదే తన ఉద్దేశమని ఆయన తెలిపారు.కాగా పరిషత్ ఎన్నికలకు ముందు సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ పిటీషన్ వేశారు. అయితే సరిగా లేదని కోర్టు చెప్పడంతో తాజాగా సరిచేసి మళ్లీ వేయగా కోర్టు విచారణకు తీసుకుంది.