Begin typing your search above and press return to search.
గాంధీలో డాక్టర్ పై దాడి ...కరోనా పేషేంట్ అరెస్ట్ !
By: Tupaki Desk | 16 April 2020 10:30 AM GMTదేశంలో మొదటిసారి ఒక కరోనా బాధితుడిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది. దీనికి కారణం ఏంటంటే ..ప్రాణాలని పనంగా పెట్టి మరీ , కరోనా భాదితులకు ట్రీట్మెంట్ చేస్తుంటే , వారి పైనే కరోనా పేషేంట్స్ దాడులకు దిగుతుండటం బాధాకరం. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రెసిడెంట్ వైద్యుడిపై దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచారు. కాగా దేశంలో ఒక కరోనా పేషెంటును అరెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్.
కాగా ఈ నెల 1వ తేదీన గాంధీ ఆస్పత్రిలో ఒక కరోనా పేషెంట్ బాత్రూమ్ లో జారి పడి మరణించాడు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి చనిపోయాడని బంధువులు దాడి చేశారు. వారిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వారిలో ఒకరైన 23 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా ఉంది. డాక్టర్ పై దాడిని వైద్య సిబ్బంది తీవ్రంగా పరిగణించి కేసు పెట్టింది. పోలీసులు బుధవారం ఇద్దరు అన్నదమ్ములను అరెస్ట్ చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరుపరిచారు. వారిద్దరికీ జడ్జి.. జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ఆ తర్వాత కరోనా పేషెంటును ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలోని క్వారంటైన్ కు తరలించారు.
కరోనా వ్యాప్తి చెందుతున్న ఇలాంటి పరిస్థితుల్లో రోగులు వైద్యులపై దాడి చేయడం సరికాదని, ఈ ఘటనను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల దృష్టికి తీసుకెళ్తామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ చెప్పారు.ఈ వ్యవహారంపై మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని ఖండించారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితిల్లోనూ క్షమించబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 24 గంటలు డాక్టర్లు ప్రజల కోసం పని చేస్తున్నారని గుర్తు చేశారు. వైద్యులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.