Begin typing your search above and press return to search.
వారసులకే దక్కిన ‘వేద’ నిలయం: ఇంట్లోకి వెళ్లి జయలలితకు నివాళి..
By: Tupaki Desk | 12 Dec 2021 6:32 AM GMTప్రముఖ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం ఆ రాష్ట్రాన్నే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అన్నాడీ ఎంకే అధినేతగా ఆ పార్టీ అధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జయలలిత పదవిలో ఉండగానే మృతి చెందారు. దీంతో ఆ తరువాత అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా జయలలితకు సంబంధించిన వేద నిలయంగా పిలువబడుతున్న తన నివాసాన్ని స్మారకంగా మార్చాలని అప్పుడు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జయలలిత మేనకోడలు దీప, ఆమె సోదరుడు దీపక్ లు ఈ విషయంపై కోర్టు కెక్కారు. కొన్నేళ్ల తరువాత వీరికి కోర్టు తీర్పు అనుకూలంగా ఇవ్వడంతో 'వేద నిలయం' వారికే చెందింది.
తమిళనాడు 'అమ్మ'గా జయలలిల ఎంతో ప్రఖ్యాతం పొందారు. సినీనటిగా ప్రస్థానం మొదలుపెట్టిన ఆమె క్రమంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే లో చేరిన ఆమె ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగారు. 1984 నుంచి 1989 వరకు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. ఆ తరువాత 1991లో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత 2016లోనూ సీఎంగా ఉండగానే డిసెంబర్ 5న రాత్రి 11.30 గంటలకు మరనించారు. అంతకుముందు రెండున్నర నెలలుగా అనారోగ్యంతో ఉన్న ఆమె పరిస్థితి విషమించి కన్నూమూశారు.
జయలలిత మరణించిన తరువాత అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమె నివసించిన వేద నిలయంను 'అమ్మ' స్మారకంగా మార్చాలన్న ప్రతిపాదనను తీసుకొచ్చారు. అయితే ఈ ప్రతిపాదనపై జయలలిత మేనకోడలు దీప, ఆమె సోదరుడు దీపికలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన మద్రాసు హైకోర్టు వేద నిలయంను స్మారకంగా మార్చాలన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లవని తెలిపింది. దానిని రద్దు చేస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఆ ఇంటి తాళాలను జయలలిత వారసులైన దీప..దీపక్ లకు అప్పజెప్పాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా మరోసారి ఈ విషయంపై చర్చించిన స్టాలిన్ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వేద నిలయాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పాలని నిర్ణయించింది. దీంతో వేద నిలయం కు సంబంధించిన తాళం బాక్సును చెన్నై కలెక్టర్ విజయరాణి.. దీప,దీపక్ లకు అందజేశారు. దీంతో తీవ్ర బావోద్వేగానికి గురైన వాళ్లు మీడియాతో మాట్లాడారు. 'ఇంతకాలానికి మల్లీ ఈ ఇంట్లో అడుగుపెట్టడం ఎంతో ఆనందంగా ఉంది. నేనే ఈ ఇంట్లోనే జన్మించాను. అత్త జయలలిత తో ఈ ఇంట్లో గడిపిన గుర్తులు ఇప్పటికీ చెరిగిపోలేదు. వాటన్నింటితో నా మనసు నిండిపోయింది. మా అత్తగారు ఎప్పటికీ మాతోనే ఉంటారన్న భావన ఉంది. ఆమె ఈ ఇంట్లో తిరిగిన గుర్తులను మననం చేసుకుంటూ ఇక్కడే జీవిస్తాం' అని అన్నారు. 'వేద నిలయం' తాళం బాక్సును అందుకు దీప.. ఆమె భర్తతో పాటు మరికొంతమంది బంధువులు ఇంట్లోకి వెళ్లారు. ముందుగా జయలలితకు నివాళులర్పించారు. ఆ తరువాత కాసేపు ఆమె గురించి మాట్లాడుకున్నారు.
ఇక జయలలిత వేద నిలయం హక్కులు తన మేనకోడలకు చెందడంపై రకరకాలుగా చర్చలు సాగుతున్నాయి. పోయేస్ గార్డెన్లో ఉన్న జయలలిత ఇల్లుపై సంవత్సరాల తరబడి వివాదంగానే సాగింది. వేద నిలయాన్ని సొంతం చేసుకునేందుకు ఆమె నిచ్చెలి శశికళ తీవ్ర ప్రయత్నాలు చేవారు. ఆమెకు ఆస్తులు చేరనీయకుండా అప్పటి ప్రభుత్వం జయలలిత నివాసాన్ని స్మారకంగా మార్చాలని ప్రతిపాదించింది. అయితే జయలలిత మేనకోడు కోర్టుకు వెళ్లడంతో సుదీర్ఘ కాలం చర్చించి చట్టబద్ధంగా జయలలిత ఆస్తులు ఆమె మేనకోడలుకే చెందుతాయని కోర్టు తీర్పు చెప్పింది.