Begin typing your search above and press return to search.
ట్రంప్ సర్కారుకు షాకిచ్చిన కోర్టు
By: Tupaki Desk | 16 May 2019 8:04 AM GMTకొన్నేళ్లుగా భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా స్వర్గధామం.. ఇండియన్ల ప్రతిభకు మెచ్చి కంపెనీలన్నీ మన స్టూడెంట్స్ ను గంపగుత్తగా ప్యాకేజీలు ఇచ్చి తీసుకెళ్లేవి.మనవాళ్లు డాలర్ల మోజులో పడి అమెరికాపై యావ పెంచుకున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చాక తేడా కొట్టింది. అమెరికన్లకే ఉద్యోగాలివ్వాలంటూ ఆయన వలసవిధానాలను సంస్కరించారు. ఇండియన్లను అమెరికాకు రానివ్వడం లేదు. అమెరికాలో పనిచేసుకుంటున్న ఇండియన్లను గడువు తీరాక సాగనంపుతున్నారు. కొత్తగా హెచ్1బీ దరఖాస్తులను కూడా తిరస్కరిస్తున్నారు. జాప్యం చేస్తున్నారు.దీంతో ఇండియన్ టెకీల అమెరికా ఆశలకు కల్లెం పడుతోంది.
ట్రంప్ అనుసరిస్తున్న వలస విధానం అక్కడి ఐటీ కంపెనీల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. దీంతో అమెరికాలోని ఐటీ కంపెనీల సమాఖ్య (ఐటీ సర్వ్ అలియెన్స్) అమెరికాలోని కోర్టును ఆశ్రయించగా.. ట్రంప్ వలస వ్యతిరేక విధానాలకు కోర్టు కళ్లెం వేసింది. హెచ్1బీ వీసా దరఖాస్తులను ఎందుకు పెద్ద ఎత్తున తిరస్కరిస్తున్నారని.. వాటీ జారీలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ట్రంప్ ప్రభుత్వాన్ని డిస్ట్రిక్ కోర్టు ప్రశ్నించింది. ఐటీ కంపెనీలను దెబ్బతీసే ఇలాంటి వలసవిధానాల్లో మార్పులు చేర్పులు ఎందుకు చేస్తున్నారో స్పందించాలని ట్రంప్ సర్కార్ ను ఆదేశించింది.
ఐటీ కంపెనీలు వేసిన పిటీషన్ లో ట్రంప్ సర్కారు తిరస్కరిస్తున్న హెచ్1బీ వీసాల సమాచారాన్ని పొందుపరిచారు. గత ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి హెచ్1బీ వీసాల తిరస్కరణ శాతం 20 నుంచి ఏకంగా 80శాతానికి పెరిగిపోయిందని పీటీషన్ లో విన్నవించింది. అదనపు సమాచారం కావాలంటూ 60శాతం దరఖాస్తులను పక్కనపెట్టారని ఈ కంపెనీల సమాఖ్య పిటీషన్ లో పేర్కొన్నాయి.
ఐటీ సేవల కంపెనీలపై ప్రభుత్వం వివక్షపూరిత వైఖరికి ఇదే నిదర్శనమని ఐటీ కంపెనీలు వాదించాయి. అదే సమయంలో సర్వీసుయేతర కంపెనీలు చేసే దరఖాస్తుల్లో ఒక్కశాతం మాత్రమే నిరాకరించారని కోర్టు దృష్టికి తెచ్చాయి. హెచ్1బీ వీసాల విధానంలో తీసుకొచ్చిన సవరణలు తమ సంస్థల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్నాయని వాటిని సడలించాలని కంపెనీలు కోర్టుకు ఫిర్యాదు చేశాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన కోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు పంపింది. తీర్పు అనుకూలంగా వస్తే ట్రంప్ తన వలస విధానంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. దీనిపైనే ఐటీ కంపెనీలు ఆశలు పెంచుకున్నాయి.