Begin typing your search above and press return to search.

నాకు మగతనమే లేదు .. అది పోలిసుల సృష్టి !

By:  Tupaki Desk   |   4 Jan 2020 11:50 AM GMT
నాకు మగతనమే లేదు .. అది పోలిసుల సృష్టి !
X
హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి కేసు విచారణ కూడా సీరియల్ లాగే రోజులు తరబడి సాగుతుంది. అమాయకమైన ఆడపిల్లలపై దారుణంగా అఘాయిత్యానికి పాల్పడి , ఆ తరువాత అన్యాయంగా చంపేసి , బావిలో పూడ్చిపెట్టిన శ్రీనివాస్ రెడ్డి కోర్టులో మాత్రం నాకు ఏమి తెలియదు ..నేను ఏమి చేయలేదు అనే మాట తప్ప ఇంకొక మాట మాట్లాడటం లేదు. నాకేమీ తెలియదు.. అంతా అబద్దం.. నాకు బైక్ కూడా రాదు.. నీకు మగతనమే లేదు ..ఇలా తన వాదనని చెప్తూ , నన్ను అన్యాయంగా పోలీసులే ఇరికించారు అని జడ్జి ముందు చెప్తున్నాడు.

పూర్తి వివరాలు చూస్తే ... హాజీపూర్ బాలికల హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై నల్లగొండ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులో విచారణ జరుగుతోంది. శుక్రవారం శ్రావణి కేసులో నిందితుడు శ్రీనివాసరెడ్డి వాదనలు ముగిశాయి. విచారణ సందర్బంగా జడ్జి అడిగిన ప్రశ్నలకు నిందితుడు చాలా తెలివిగా సమాధానాలు చెప్పాడు. విచారణ సందర్భంగా 44మంది సాక్షుల వాంగ్మూలాన్ని న్యాయమూర్తి చదివి వినిపించారు. ఎన్ని చెప్పినప్పటికీ ..నిందుతుడు మాత్రం.. నాకేమీ తెలియదు, అంతా అబద్దం అని పదే పదే చెప్పాడు. శ్రావణిని బైక్ పై ఎక్కించుకుని వెళ్లినట్లు సాక్షులు చెబుతున్నారని జడ్జి అడిగితే.. నాకసలు బైక్ నడపడమే రాదని, లోదుస్తులపై ఆనవాళ్ల గురించి ప్రశ్నిస్తే.. అది పోలీసుల సృష్టి అని చెప్పాడు. ఘటనా స్థలంలో దొరికిన బీరు బాటిళ్లపై ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి.. దాని సంగతి ఏంటని జడ్జి అడిగితే.... పోలీసుల బలవంతంగా ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారని నిందితుడు శ్రీనివాసరెడ్డి ఆరోపించాడు. పోలీసులు తనను కొట్టి నేరాలు ఒప్పుకునేలా చేశారని ఆరోపణలు చేశాడు. అలాగే మృతుల దుస్తులపై ఉన్న వీర్యకణాల గురించి ప్రశ్నించగా .. నాకు సంబంధం లేదు. పోలీసులు సిరంజి ద్వారా నాదగ్గర నుంచి వీర్యం తీసుకెళ్లారు అని తెలిపాడు. అసలు నాకు మగతనమే లేదు అని చెప్పాడు.

నాలుగు సంవత్సరాల క్రితం కల్పన అనే అమ్మాయిని కూడా అత్యాచారం, హత్య చేసి బస్తాలో మూటకట్టి అదే మర్రిబావిలో పాతిపెట్టావు, అది కూడా అందరి ముందు నేనే పాతిపెట్టానని ఒప్పుకున్నావు కదా అని న్యాయమూర్తి అడగ్గా అంతా అబద్ధం.. నన్ను పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచారు. బావి వద్దకు తీసుకెళ్లలేదు అని నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి సమాధానం చెప్పాడు. అయితే , వైద్యులు నువ్వు ఫిట్‌గానే ఉన్నావని తెలిపారని, నువ్వు పని చేసే చోట ఒక వేశ్యని తీసుకొచ్చి చంపి నీటి ట్యాంక్‌లో వేశావని, అప్పట్లో నిన్ను కర్నూల్‌ లో పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కూడా చేశారు కదా అని అడగ్గా అది కూడా అబద్ధమేనని నిందితుడు సమాధానం చెప్పాడు. నీకు నాలుగైదు ఫోన్‌ నంబర్లు ఉన్నాయి, నీ ఫోన్‌ లో చనిపోయిన శ్రావణి, కల్పన, మనీషాల ఫొటోలు ఉన్నాయి. నీఫోన్‌ సీజ్‌ చేసి డేటాను పరిశీలించగా నువ్వు బూతు బొమ్మలు చూసేవాడివని తేలింది, దానికి ఏమి సమాధానం చెప్తావు అని అడగ్గా నిందితుడు నాకు చిన్న ఫోన్‌ ఉంది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లేదు అని చెప్పాడు. అయితే , నీ మీద కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తే తమ భూమి అమ్మలేదని కొందరు చేశారని, కావాలనే ఇరికించారని చెప్పాడు. దీనితో ఈ కేసుని 6 వ తేదికి వాయిదా వేశారు. అయితే , శ్రీనివాసరెడ్డిని ఉరి తీయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.