Begin typing your search above and press return to search.
వెహికిల్స్ బాధ్యత వాలెట్ పార్కింగ్ యజమానిదే
By: Tupaki Desk | 25 Jun 2015 4:46 AM GMTకొన్ని షాపులకు వెళ్లినప్పుడు వాలెట్ పార్కింగ్ ఉంటుంది. వారికి తమ కార్లను అప్పగించిన తర్వాత ఏదైనా జరిగే బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నకు తాజాగా వినియోగదారుల కోర్టు విస్పష్టంగా తీర్పు ఇచ్చేసింది. వాలెట్ పార్కింగ్‌లో ఉంచిన వాహనాల బాధ్యత సదరు వాణిజ్య సంస్థ యజమానిదేనని తేల్చింది. ఒక వివాదంతో ఈ తీర్పును వినియోగదారుల కోర్టు ఇచ్చింది.
బియాండ్ కాఫీ షాప్ అనే సంస్థ వద్దకు మోహెది అనే వ్యక్తి వెళ్లాడు.ఈ సందర్భంగా తన వాహనాన్ని వాలెట్ పార్కింగ్‌కు అప్పజెప్పి రశీదు తీసుకున్నాడు. అయితే.. అతను తిరిగి వచ్చేసరికి కారు లేదు. ఏదని అడిగితే.. మెహెది స్నేహితుడిని అని చెప్పటంతో కారు ఇచ్చేశామని పార్కింగ్ సిబ్బంది చెప్పారు. రెండు రోజుల పాటు తిరిగిన తర్వాత.. చివరకు పాడైన స్థితిలో కారు దొరికింది.
దాన్ని షోరూంలో బాగు చేయిస్తే రూ.3లక్షల మేర బిల్లు వచ్చింది. అయితే.. దీని బీమా కోసం క్లెయిం చేశారు. సదరు బీమా సంస్థ కాఫీడే సంస్థకు నోటీసు ఇచ్చింది. వాలెట్ పార్కింగ్‌తోతమకు సంబంధం లేదని సదరు సంస్థ వాదించింది. అయితే.. ఈ వాదనను ఒప్పుకోని వినియోగదారుల కోర్టు.. సదరు షాపు వారు బీమా సంస్థకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ తీర్పు ఇచ్చారు. సో.. వాలెట్ పార్కింగ్‌లో ఉంచిన వాహనాల పూర్తి సంరక్షణ బాధ్యత సదరు షాపు వారిదేనని మరోసారి తేలింది.