Begin typing your search above and press return to search.
ఇంగ్లిషే తమ భాష అన్న సుప్రీం!
By: Tupaki Desk | 8 Dec 2015 5:26 AM GMTసుప్రీంకోర్టు వ్యవహారాలకు సంబంధించిన ఒక కీలక అంశంపై సర్వోన్నత న్యాయస్థానం తాజాగా తన వైఖరిని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో తీర్పుల్ని జాతీయ భాష అయిన హిందీతో పాటు.. కొన్ని ప్రాంతీయ భాషల్లో కూడా తీర్పుల ప్రతులు ఇవ్వాలంటూ ఒక పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈ పిటీషన్ ను డేసింది.
కోర్టు భాష ఇంగ్లిష్ మాత్రమేనని.. పిటీషనర్ కోరిన విధంగా వేర్వేరు భాషల్లో ఆదేశాలు ఇవ్వలేమని తేల్చేసింది. ఇంగ్లిషుతో భారతీయ భాషలైన హిందీ.. పలు ప్రాంతీయ భాషల్లో కూడా కోర్టు ఆదేశాలు అందుబాటులో ఉంటే.. మరింత సౌకర్యంగా ఉంటుందన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. అయితే.. దీనికి భిన్నంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తాజాగా అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేయటం గమనార్హం. మరి.. దీనిపై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో..?