Begin typing your search above and press return to search.

అబ్బే..అమిత్ షా కొడుకు ప‌రువు పోలేదు!

By:  Tupaki Desk   |   24 Dec 2017 5:55 AM GMT
అబ్బే..అమిత్ షా కొడుకు ప‌రువు పోలేదు!
X
ఔను. ఇప్పుడు ఇదే వార్త చ‌ర్చ‌నీయాంశం. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడు జయ్‌షా ప‌రువు పోయిందా? పోలేదా?. ఆ చ‌ర్చ కాస్త కోర్టుకు చేరింది. దీంతో వాద‌న‌లు విన్న కోర్టు...ప‌రువుపోలేద‌ని తీర్పు ఇచ్చింది. ఇది స్థూల‌గా విష‌యం. ఇక వివ‌రాల్లోకి వెలితే..కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత జయ్‌షా కంపెనీ టర్నోవర్‌ అనూహ్యంగా(16,000 రెట్లు) పెరిగిపోయినట్టు ది వైర్ అనే వెబ్ సైట్ ఈ ఏడాది అక్టోబర్‌ 8న 'ది గోల్డెన్‌ టచ్‌ ఆఫ్ జయ్‌ అమిత్‌ షా' పేరుతో వార్తా కథనం రాసింది. దీనిపై జయ్‌ షా సివిల్‌ కోర్టులో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ది వైర్‌ యాజమాన్యంతోపాటు కథనం రాసిన జర్నలిస్ట్‌ ను నిందితులుగా పేర్కొన్నారు. దాంతో, అక్టోబర్‌ 10న ఆ కథనంపై తాత్కాలిక నిషేధం విధిస్తూ సివిల్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కథనంలోని అంశాలను ఏరకమైన మీడియాలోనూ ప్రచారం చేయొద్దంటూ సివిల్‌ కోర్టు గత ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

అయితే దీనిపై దివైర్ అహ్మదాబాద్‌ లోని మీర్జాపూర్‌ సివిల్‌ కోర్టులో అప్పీల్ చేసింది. తాజా విచారణలో గతంలో ఇచ్చిన నిషేధపు ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్టు సివిల్‌ కోర్టు తెలిపింది. దీనిపై స్పందించిన జయ్‌షా న్యాయవాది తాము హైకోర్టుకు వెళ్లి తిరిగి ఇంజెక్షన్‌ ను పొందేందుకు వీలుగా మరో నెల రోజులు నిషేధాన్ని కొనసాగించాలని కోర్టును కోరారు. ఒక్కరోజు కూడా అవకాశం ఇవ్వొద్దని ది వైర్‌ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదట 15 రోజుల అవకాశమిచ్చేందుకు ప్రతిపాదించిన కోర్టు ఆ తర్వాత వైర్‌ అభ్యంతరంతో వెనక్కి తగ్గింది. జయ్‌ షాకు అనుకూలంగా ఇంజెక్షన్‌ ఇవ్వడం మీడియా భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడమేనని ది వైర్‌ తరఫు న్యాయవాది వాదించారు.

సివిల్‌ కోర్టు తాజా నిర్ణయంతో భావ ప్రకటనా స్వేచ్ఛకు విజయం చేకూరిందని ది వైర్‌ పేర్కొంది. పరువు నష్టం కలిగించే అంశాలేమీ తమ కథనంలో లేవని కోర్టు ముందు ది వైర్‌ తన వాదన వినిపించింది. ప్రభుత్వానికి జయ్‌షా సమర్పించిన లెక్కల ఆధారంగానే తమ కథనంలో సమాచారమిచ్చామని ది వైర్‌ స్పష్టం చేసింది. ఈ వాద‌న‌తో ఏకీభ‌విస్తూ ది వైర్‌ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనంపై నిషేధం తొలగిపోయింది.