Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ పై ప‌రువు న‌ష్టం కేసు విచారణ‌!

By:  Tupaki Desk   |   24 Aug 2018 2:18 PM GMT
ప‌వ‌న్ పై ప‌రువు న‌ష్టం కేసు విచారణ‌!
X
కొంత‌మంది మీడియా అధినేత‌ల‌పై, కొన్ని మీడియా చానెళ్ల‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌న‌సేన అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కొద్ది రోజుల క్రితం విరుచుకుపడిన సంగ‌తి తెలిసిందే. దాదాపుగా ట్విట్ట‌ర్ నే త‌న అన‌ధికారిక మీడియా చానెల్ గా మార్చుకున్న ప‌వ‌న్....త‌న‌పై దుష్ప్ర‌చారం చేసిన చానెళ్ల‌పై సంచ‌ల‌న ట్వీట్లు చేశారు. కొన్ని మీడియా చానెళ్ల‌పై సుదీర్ఘ‌మైన న్యాయ‌పోరాటం చేయ‌బోతున్నాన‌ని ప‌వ‌న్ అన్నారు. ఈ క్ర‌మంలోనే ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఎండీ పై ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో పెను దుమారం రేపాయి. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ పై ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ‌...పరువు నష్టం కేసు వేశారు. తాజాగా, హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో ఆ కేసు గురువారం విచారణకు వచ్చింది.

తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగింలా ప‌వ‌న్ ట్విట్టర్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశార ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఆరోపించారు. ప‌వ‌న్ పై రూ.10కోట్లకు పరువునష్టం కేసు దాఖలు చేశారు. గురువారం నాడు ఆ కేసు విచార‌ణ‌కు సంబంధించి....పవన్ తరఫున ఆయ‌న‌ న్యాయవాది కె.చిదంబరం వకాలత్‌ దాఖలు చేశారు. అభియోగాల నమోదు కోసం న్యాయ‌మూర్తి కొంత గ‌డువిచ్చారు. ఈ కేసు విచార‌ణ‌ను అక్టోబరు 26కు వాయిదా వేశారు. కాగా, ఈ ప‌రువు న‌ష్టం దావాపై గతంలో పవన్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. మ‌రోవైపు, ప‌వ‌న్ కంటికి గురువారం మరోసారి ఆపరేషన్‌ జరిగిందని ఆ పార్టీ మీడియా విభాగం తెలిపింది. నెల క్రితం తొలి ఆపరేషన్ జ‌రిగిన త‌ర్వాత తగినంత విశ్రాంతి తీసుకోకపోవడంతో ఇన్‌ఫెక్షన్‌ అయిందని, అందుకే మ‌రో శ‌స్త్ర‌చికిత్స చేశార‌ని తెలిపింది.