Begin typing your search above and press return to search.

ఆ ‘‘అతి’ హీరోను కస్టడీకి ఇవ్వమంటున్నారు

By:  Tupaki Desk   |   28 March 2016 4:25 PM GMT
ఆ ‘‘అతి’ హీరోను కస్టడీకి ఇవ్వమంటున్నారు
X
రెండు బుడ్డ సినిమాల్లో హీరోగా నటించి హడావుడి చేసిన యువ నటుడు ఉదయ్ కిరణ్ నేమూరి ఈ మధ్యన వార్తల్లోకి రావటం తెలిసిందే. మాదాపూర్ లోని ఓ హోటల్ లోని పబ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించటం.. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో గొడవ పడటం.. తాగి నానా యాగీ చేయటమే కాదు.. పబ్ లోకి వెళ్లి బట్టలు విప్పదీసేసి రచ్చ రచ్చ చేసిన అతగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా తన యూనిట్ సభ్యులు చేసుకున్న పార్టీ విషయంలో ఏదో గొడవ అయితే పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లుగా చెప్పుకున్న ఉదయ్ కిరణ్ కు తెలియని విషయం ఏమిటంటే.. తాను చేసిన రచ్చ మొత్తం సీసీ కెమేరాల్లో రికార్డు అయ్యిందని. తాను ముంబయి నుంచి హైదరాబాద్ కు జస్ట్ వచ్చానని.. కావాలంటే టిక్కెట్లు చూపిస్తానంటూ మాటలతో మాయ చేయాలని ప్రయత్నించినా.. సీసీ కెమేరాల పుణ్యమా అని అడ్డంగా దొరికిపోయారు.

ఆయన్ను కోర్టు ముందు ప్రవేశపెట్టగా.. రిమాండ్ కు తరలిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు విషయమై మరింత సమాచారం కోసం యువనటుడ్ని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. దీనిపై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. అతి చేసి అడ్డంగా బుక్ అయిన ఈ యువనటుడి ఉదంతం కొందరికైనా కనువిప్పు కలిగిస్తే మంచిది.