Begin typing your search above and press return to search.

రూ.35లక్షలు ఇవ్వకుంటే ఆ రైలు తీసేసుకోండి

By:  Tupaki Desk   |   14 April 2015 10:33 AM GMT
రూ.35లక్షలు ఇవ్వకుంటే ఆ రైలు తీసేసుకోండి
X
సంచలన వ్యాఖ్యలు చేయటం అప్పుడప్పుడు కోర్టు చేస్తుంటాయి. అదే సమయంలో సంచలన తీర్పులు కాస్తంత అరుదుగానే ఇస్తుంటారు. కానీ.. తాజాగా సంచలన తీర్పులకే మా గొప్ప సంచలన తీర్పును ఒకటి హిమాచల్‌ ప్రదేశ్‌ కోర్టు ఇచ్చి టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌ అయ్యింది.

ఉనా.. అంబా పట్టణాల మధ్య రైల్వే ట్రాక్‌ కోసం రైల్వే శాఖ భూములు తీసుకుంది. అది కూడా 1998లో. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆ ఇద్దరు రైతులకు పరిహారం ఇవ్వలేదు. ఇప్పటికే ఒకసారి కోర్టు తీర్పు ఇస్తూ.. వారిద్దరికి పరిహార మొత్తాన్ని ఇవ్వాలని 2013లో తీర్పు ఇచ్చారు. అయినా.. రైల్వేశాఖకు పట్టలేదు.

తాజాగా.. కోర్టు ఆదేశాలు అమలు కావటం లేదని బాధితులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు తాజాగా ఒక సంలచన తీర్పు వచ్చింది. ఈ నెల 15లోపు కానీ రైతులకు చెల్లించాల్సిన రూ.35 లక్షల మొత్తాన్ని రైల్వే శాఖ ఇస్తే ఇచ్చినట్లు.. ఒకవేళ ఇవ్వని పక్షంలో ఏప్రిల్‌ 16న ఉదయం ''ఉనా'' రైల్వే స్టేషన్‌కు వెళ్లి జనశతాబ్ది రైలును ఆపేసి స్వాధీనం చేసుకోవచ్చని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది.

ఈసారి కానీ రైల్వేఅధికారులు.. ఈ బాధితులకు పరిహారం మొత్తం ఇవ్వకుంటే.. దేశంలో రైలు బండి ఓనర్లుగా వీరిద్దరు మారే వీలుంటుంది. మరి.. కోర్టు చెప్పినట్లుగా బుద్ధిగా పరిహారం చెల్లిస్తారా? లేదంటే.. ఏప్రిల్‌ 16న జనశతాబ్ది రైలులో ప్రయాణించే ప్రయాణికుల్ని ఇబ్బంది పెడతారో చూడాలి.