Begin typing your search above and press return to search.
కోడెల కూతురు అరెస్టుపై కోర్టు ఆదేశాలు!
By: Tupaki Desk | 25 July 2019 4:35 AM GMTతెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కోడెల కుటుంబం పై పలు ఫిర్యాదులు చోటు చేసుకున్నాయి. కోడెల కూతురు, కొడుకు బాధితులమంటూ అనేక మంది పోలీసులను ఆశ్రయించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా.. కోడెల తనయ - తనయుడు తమను బెదిరించి వసూళ్లకు పాల్పడినట్టుగా అనేక మంది ఆరోపించారు.
వరస పెట్టి వాళ్లంతా పోలిస్ స్టేషన్ చేరారు.ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులతో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మీద కూడా కేసు ఒకటి నమోదు అయ్యింది. మరోవైపు కొంతమంది దళిత బాధితులు కూడా వారిపై ఫిర్యాదులు చేశారు. దీంతో అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి. ఆ వ్యవహారంలో కోడెల కూతురును అరెస్టు చేయవచ్చని వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో కోడెల శివప్రసాద్ తనయ విజయలక్ష్మి ముందస్తు బెయిల్ తీసుకున్నారు. కోర్టును ఆశ్రయించి ఆమె అరెస్టు నుంచి తాత్కాలిక మినహాయింపును పొందారు. అట్రాసిటీ కేసులో కోడెల కూతురును అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసు విచారణ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. కోడెల కూతురుకు అయితే తాత్కాలిక ఉపశమనం దక్కిందని పరిశీలకులు అంటున్నారు.