Begin typing your search above and press return to search.
బ్రిటన్ కు జగన్ పయనం!
By: Tupaki Desk | 16 Feb 2019 6:36 AM GMTఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత త్వరలో యూరప్ లోని లండన్ వెళ్లనున్నట్లు సమాచారం. తన కుమార్తెను కలవడానికి జగన్ వెళ్లనున్నారు. జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు కోర్టు షరతులతో కూడిన అనమతిని ఇచ్చినట్టు సమాచారం. జగన్ మోహన రెడ్డి కుమార్తె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ చదువుతున్నారు. తన కుమార్తెను కలుసుకునేందుకు, లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా జగన్ సీబిఐ కోర్టులో పిటీషన్ పెట్టుకున్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన ధర్మాసనం ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18వ తేది వరకూ లండన్ వెళ్లేందుకు అనుమతించింది. అయితే ధర్మాసనం కొన్ని షరతులు కూడా విధించినట్లు తెలుస్తోంది. లండన్‌లో జగన్ పర్యటించాలనుకుంటున్న ప్రదేశాలు, లండన్ ల్యాండ్ లైన్ ఫోను నెంబర్ - సెల్ నెంబర్ - ఈ-మెయిల్ - ఫ్యాక్స్ ఇతర వివరాలు సీబిఐ అధికారులకు అందజేయవలసిందిగా షరతులు పెట్టినట్లు తెలుస్తోంది.
జగన్ మోహాన రెడ్డి గత నెల అంటే జనవరిలోనే లండన్ వెళ్లాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్ లో మారిన రాజకీయ పరిణామాల కారణంగా ఆయన తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. లండన్ పర్యటన తర్వాత ఆయన తన పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మంచి రసవత్తంగా ఉన్నందున, అటు వారు ఇటు... ఇటు వారు అటు సర్దుకుంటున్నందున జగన్ ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల షెడ్యూల్ మార్చ్ మొదటి వారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ లోగా జగన్ తన లండన్ పర్యటనతో కాస్త సేద తీరి ఆ తర్వాత తిరిగి పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.