Begin typing your search above and press return to search.

నో బెయిల్.. టీడీపీ నేతలకు కష్టకాలం

By:  Tupaki Desk   |   30 July 2020 3:30 PM GMT
నో బెయిల్.. టీడీపీ నేతలకు కష్టకాలం
X
అవినీతి కేసుల్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న టీడీపీ నేతలకు కోర్టుల్లో చుక్కెదురు అవుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ ను హైకోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డికి అదే అనుభవం ఎదురైంది. ఇప్పుడు తాజాగా ఒక బీసీ వ్యక్తి హత్యలో నిందితుడిగా ఉన్న టీడీపీ నేత కొల్లు రవీంద్రకు షాక్ తగిలింది.

తాజాగా కొల్లు రవీంద్ర బెయిల్ పిటీషన్ ను కోర్టు తిరస్కరించింది. అచ్చెన్న, జేసీ, కొల్లులు అరెస్ట్ అయినప్పటి నుంచి బెయిల్ పీటషన్లను టీడీపీ నేతలు వేస్తూనే ఉన్నారు. కానీ కోర్టుల్లో మాత్రం వీరికి ఊరట దక్కడం లేదు. బెయిల్ దొరకడం లేదు.

హత్య కేసు విచారణలో ఉందని.. ఇలాంటి సమయంలో కొల్లు రవీంధ్రకు బెయిల్ ఇస్తే ఆయన సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రొసిక్యూషన్ వాదనకు కోర్టు అంగీకరించి కొల్లు రవీంద్ర బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది.

ఎం. భాస్కర్ రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ అయిన భాస్కర్ రావును జూన్ 29న మచిలిపట్నం చేపల మార్కెట్లో పట్టపగలు గుర్తుతెలియని నలుగురు వ్యక్తులను కత్తులతో పొడిచి హత్య చేశారు. హత్యకు గురైన భాస్కర్ రావు కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేశారు. ఈ హత్య కుట్ర వెనుక రవీంద్ర సూత్రధారి అని ఆరోపించిన భాస్కర్ రావు భార్య ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు.