Begin typing your search above and press return to search.
గూగుల్ కు షాక్ ఇచ్చిన కోర్టు.. 2.4 బిలియన్ యూరోల ఫైన్
By: Tupaki Desk | 12 Nov 2021 10:30 AM GMTగూగుల్ సెర్చ్ ఇంజన్.. ఇది తెలియని వారంటూ ఎవరూ ఉండరు. స్మార్ట్ ఫోన్ చేత పట్టిన చిన్న పిల్లల దగ్గర నుంచి యూట్యూబ్ లో వీడియోలు, సీరియళ్లు ముసలి వాళ్ల వరకు గూగుల్ అనే ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఓకే గూగుల్.. అనగానే హౌ కెన్ ఐ హెల్ప్ యు అని మనకు కావాల్సిన సేవలను చిటికెలో అందిస్తుంది. అయితే ఇలాంటి గూగుల్ కు యూరోపియన్ యూనియన్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఫైన్ గా విధించిన సుమారు 2.4 బిలియన్ల యూరోలను కోర్టుకు కట్టాలని సుస్పష్టమైన ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఇందుకు సంబంధించిన తీర్పును యూరోపియన్ యూనియన్ కోర్టు గతంలోనే ఇచ్చింది.
ఉత్తర్వుల్లో పేర్కొన్న మొత్తం సొమ్మును కచ్చితంగా కట్టాల్సి ఉంటుందని ఈ సెర్చ్ ఇంజన్ సంస్థకు తెలిపింది. మొదటగా ఇచ్చిన తీర్పులో ఎటువంటి మార్పులు చేయకుండా... వాటిని సమర్థిస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఓ కేసుకు సంబంధించి గతంలో 2.4 బిలియన్ల యూరోలను గూగుల్ కు జరిమానాగా విధించింది కోర్టు. అయితే నాడు ఇచ్చిన తీర్పును తిరిగి సమీక్షించాలని న్యాయస్థానాన్నిఆశ్రయించింది. ముఖ్యంగా ఉత్తర్వుల్లో పేర్కొన్న జరిమానాను తొలగించాల్సిందిగా గూగుల్ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన యూరోపియన్ న్యాయస్థానం గూగుల్ కు ఆ మొత్తంలో ఫైన్ విధించడం సబబేనని తీర్పు చెప్పింది. ఉత్తర్వుల్లో పేర్కొన్న మొత్తాన్ని సంస్థ కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
గూగుల్ కు ఇంత భారీ మొత్తంలో యూరోపియన్ యూనియన్ కోర్టు ఎందుకు జరిమానా వేసింది ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 2017 లో గూగుల్ యాంటీ ట్రస్ట్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఈ సర్చ్ ఇంజన్ సంస్థ సొంత షాపింగ్ సర్వీసులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. వాటికి అనుకూలంగా వ్యవహరించిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు యూనియన్ చివరగా గూగుల్ కు 2.4 బిలియన్ యూరోలను జరిమానాగా విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ను సవాల్ చేస్తూ జనరల్ కోర్టులో అప్పీల్ చేసింది గూగుల్.
ఇందులో భాగంగానే తమ సర్చ్ ఇంజెన్ లో మార్పులు చేసినట్లు గూగుల్ తరపు న్యాయవాదులు ధర్మాసనానికి నివేధించారు. అయినా గూగుల్ పేర్కొన్న విషయాలను పక్కన పెట్టిన న్యాయస్థానం జరిమానా విధించిన మొత్తం 2.4 బిలియన్ యూరోలను కోర్టుకు కట్టాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఇప్పటికే గూగుల్ కు మరో రెండు యూరోపియన్ నియంత్రణ సంస్థలు యాంటీ ట్రస్ట్ పెనాలిటీని విధించాయి. మొత్తంగా చూసుకుంటే గూగుల్ సుమారు 8.25 బిలియన్ యూరోలు నియంత్రణ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది కానీ దీనిపై గూగుల్ ఇప్పటికే పలుమార్లు న్యాయస్థానాల్లో పిటీషన్లు దాఖలు చేసింది. వీటిపై ఆయా సంస్థలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే జరిగితే గూగుల్ కు భారీగా నష్టం వాటిల్లినట్లే అని నిపుణులు చెప్తున్నారు.