Begin typing your search above and press return to search.
ఏపీ స్పీకరుకు తెలంగాణ కోర్టు షాక్
By: Tupaki Desk | 28 May 2018 5:02 PM GMTఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు తెలంగాణ రాష్ట్రంలోని ఒక కోర్టు షాకిచ్చింది. ఎన్నికల ఖర్చు విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కోర్టు ఆయన్ను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. 2014 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీచేసినప్పుడు చేసిన ఖర్చు గురించి గతంలో ఆయన నోరు జారారు. తాను ఎంత ఖర్చు చేసిందీ చెప్పారు. అదే ఇప్పుడు ఆయన్ను ఇరకాటంలోకి నెట్టింది.
తెలంగాణలోని కరీంనగర్ స్పెషల్ మొబైల్ కోర్టు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును జూన్ 18న స్వయంగా వచ్చి కేసు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 2014 ఎన్నికల్లో తాను రూ. 11.50 కోట్లు ఖర్చు చేశానని ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో గతంలో కోడెల చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించిన కోడెలను అనర్హుడిగా ప్రకటించాలని కరీంనగర్ కు చెందిన సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో కోడెలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 2017 మార్చి 7న కోడెలకు కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో, హైకోర్టును ఆశ్రయించిన కోడెల వ్యక్తిగతంగా తాను కోర్టుకు హాజరుకాలేనని స్టే తెచ్చుకున్నారు. ఈ స్టే ఆర్డర్ ను సవాల్ చేస్తూ, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం భాస్కర్ రెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించారు. వాదోపవాదాలను విన్న తర్వాత... జూన్ 18న కోడెల స్వయంగా కరీంనగర్ కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు.