Begin typing your search above and press return to search.

అర‌వ‌కుంటే ఇష్టంతో రేప్ చేసుకున్న‌ట్లేన‌ట‌

By:  Tupaki Desk   |   28 March 2017 6:44 AM GMT
అర‌వ‌కుంటే ఇష్టంతో రేప్ చేసుకున్న‌ట్లేన‌ట‌
X
మాయ‌దారి తీర్పులు కొన్ని ఉంటాయి. ఘోర‌మైన అవ‌మానం.. అన్యాయం జ‌రిగి.. తీర‌ని మ‌నోవేద‌న‌తో కోర్టు ముందుకు వ‌చ్చిన బాధితుల విష‌యాన్ని అన్ని కోణాల్లో విచారించి తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. ఆ జ‌డ్జి ఇచ్చిన తీర్పు విన్నోళ్లంతా షాక్ తిన‌ట‌మే కాదు.. ఇదెక్క‌డి న్యాయం అంటూ అవాక్కు అవుతున్నారు. ప్ర‌స్తుతం ఇట‌లీలో నిర‌స‌న సెగ పుట్టిస్తున్న ఒక జ‌డ్జి ఇచ్చిన తీర్పుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. రేప్‌న‌కు గురైన బాధిత మ‌హిళ‌.. రేప్ చేసే స‌మ‌యంలో పెద్ద‌గా అర‌వ‌లేద‌న్న కార‌ణాన్ని ఎత్తి చూపి.. అది రేప్ ఎంత‌మాత్రం కాద‌న్న వాద‌న‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతూ ఇచ్చిన తీర్పుపై వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా తీవ్రంగా మండిప‌డుతున్నారు. చివ‌ర‌కు ఈ తీర్పుపై ఆగ్ర‌హ‌జ్వాల‌లు ఎంత ఎక్కువ‌గా ఉన్నాయంటే.. ఈ తీర్పును మ‌రోసారి స‌మీక్షించాలంటూ ఇట‌లీ దేశ న్యాయ‌శాఖామంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇంత‌కూ జ‌రిగిందేమంటే..

ఉత్త‌ర ఇట‌లీలోని టురిన్ సిటీకి చెందిన ఒక బాధితురాలు రేప్‌ న‌కు గురైంది. ఈ కేసు కోర్టుకు వ‌చ్చింది. నిందితుడిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వ్య‌క్తి రేప్‌ కు భిన్న‌మైన వాద‌న‌లు వినిపించాడు. బాధితురాలు త‌న‌కు తెలిసిన వ్య‌క్తేన‌ని.. ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే శృంగారం చేశామ‌ని.. రేప్ ఎంత‌మాత్రం కాద‌ని వాదించ‌టంతో పాటు.. ఆ స‌మ‌యంలో రేప్ అయితే బాధితురాలు గ‌ట్టిగా ఎందుకు కేక‌లు పెట్ట‌లేదంటూ పాయింట్ బ‌య‌ట‌కు తీశాడు. ఈ లాజిక్ స‌ద‌రు న్యాయ‌మూర్తి క‌న్వీన్స్ అయ్యారు.

నిజంగానే రేప్ అయితే.. ఎందుకు పెద్ద‌గా అర‌వ‌లేదంటూ జ‌డ్జి డైమాంటీ మునిస్సీ ప‌దే ప‌దే అడ‌గ‌టంతో బాధితురాలి నోటి నుంచి మాట రాని ప‌రిస్థితి. తెలిసిన వ్య‌క్తే ఇంత ఘోరానికి పాల్ప‌డ‌టంతో త‌న నోటి నుంచి మాట రాలేద‌ని.. షాక్‌కు గురైన‌ట్లుగా బాధితురాలు వాపోయింది. అయితే.. ఈ వాద‌న‌కు సంతృప్తి చెంద‌ని జ‌డ్జి.. రేప్ స‌మ‌యంలో కేక‌లు వేయ‌నందుకు.. దాన్ని రేప్‌గా ప‌రిగ‌ణించ‌లేమంటూ కేసును కొట్టేసి.. నిందితుడ్ని నిర్దోషిగా ప్ర‌క‌టించారు. ఈ తీర్పుపై ఇట‌లీ వ్యాప్తంగా మ‌హిళ‌లు.. మ‌హిళాసంఘాలు తీవ్రంగా విరుచుకుప‌డ‌టంతో పాటు.. ఇదేమాత్రం స‌రైన‌ది కాదంటూ నిర‌స‌న‌లు చేప‌ట్టారు. చివ‌ర‌కు ఆ దేశ న్యాయ‌శాఖామంత్రి జోక్యం చేసుకొని.. తీర్పును పునఃస‌మీక్షిస్తామంటూ ప్ర‌క‌ట‌న చేయాల్సి వ‌చ్చింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/