Begin typing your search above and press return to search.
77.8 శాతం.. కోవాగ్జిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ రిపోర్ట్
By: Tupaki Desk | 3 July 2021 11:24 AM GMTకరోనా ఉదృతి నేపథ్యంలో వ్యాక్సిన్ ల పూర్తి స్థాయి క్లీనికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగంకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఒక వైపు వ్యాక్సిన్ ను వినియోగిస్తూనే మరో వైపు చివరి దశ క్లీనికల్ ట్రయల్స్ ను సంస్థలు నిర్వహించాయి. భారత సంస్థ భారత్ బయోటెక్ వారు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ మూడవ దశ క్లీనికల్ ట్రయల్స్ రిపోర్ట్ ను విడుదల చేశారు.
ఆ సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ అనుసారంగా కరోనాపై కోవాగ్జిన్ వ్యాక్సిన్ 77.8 శాతం వరకు పని చేస్తుంది. కొత్త వేరియంట్ అయిన డెల్టా కరోనా వైరస్ పై కోవాగ్జిన్ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పని చేస్తుందని.. 63.6 శాతం వరకు డెల్టా వైరస్ ను కూడా కోవాగ్జిన్ ఎదుర్కొంటుందని వారు నమ్మకంగా చెబుతున్నారు. కోవాగ్జిన్ వినియోగించిన మొత్తం 130 మంది నుండి ఈ రిపోర్ట్ ను తీసినట్లుగా సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
కోవాగ్జిన్ మూడు దశల క్లీనికల్ ట్రయల్స్ ముగించుకుని శాస్త్రీయ విశ్వాసంను కూడా దక్కించుకుందని.. ప్రపంచంలోని అత్యుత్తమ పది కరోనా వ్యాక్సిన్ లలో భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ నిలుస్తుందని సంస్థ ప్రతినిధులు అంటున్నారు. సేఫ్టీ మరియు సమర్థత విషయంలో ఇతర వ్యాక్సిన్ ల కంటే చాలా అత్యుత్తమ ప్రదర్శణను కోవాగ్జిన్ కనబర్చుతున్నట్లుగా కూడా పేర్కొన్నారు. అంతర్జాతీ స్థాయిలో టాప్ 10 లో తమ వ్యాక్సిన్ నిలిచేలా కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అంటూ సంస్థ వ్యవస్థాపకులు సుచిత్రా ఎల్లా అన్నారు.
కోవాగ్జిన్ ను 18 నుండి 98 ఏళ్ల వయసు వారిలో ప్రయోగించాం. మొత్తం 130 మందిలో ప్రయోగించగా చెడు ప్రభావం కేవలం 0.5 శాతం మందిలో మాత్రమే కనిపించింది. ఇతర వ్యాక్సిన్ ల చెడు ప్రభావ శాతంతో పోల్చితే ఇది చాలా చాలా తక్కువ అంటూ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. వ్యాన్సిన్ ల తయారీలో భారత్ బయోటెక్ వద్ద ఉన్న అత్యాధుని టెక్నాలజీ మరియు ప్రతిభ కు ఇది నిదర్శణంగా అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని ఈ సందర్బంగా సంస్థ పేర్కొంది.
ఇండియాతో పాటు కోవాగ్జిన్ ను మొత్తం 16 దేశాల్లో నమ్ముతున్నరని.. ఎన్నో దేశాల్లో కోవాగ్జిన్ ను ఇప్పటికే పంపిణీ చేయడం మొదలు పెట్టారు. కొన్ని దేశాలు కూడా కోవాగ్జిన్ టీకా కోసం ఆర్డర్స్ ఇచ్చారని త్వరలోనే వారికి కూడా కోవాగ్జిన్ టీకాను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సందర్బంగా డాక్టర్ కష్ణా ఎల్లా పేర్కొన్నారు. భారత ఫార్మ రంగం గొప్పతనంను తెలియజేసే విధంగా కోవాగ్జిన్ అద్బుత ఫలితాలను కనబర్చుతుందని.. ప్రతి దేశం కూడా కరోనా వ్యాక్సిన్ విషయంలో కోవాగ్జిన్ గురించిన అద్యయనం తాలూకు విషయాలను పరిశీలిస్తున్నట్లుగా ఈ సందర్బంగా సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.