Begin typing your search above and press return to search.
తగ్గిన కొవాగ్జిన్ ధర.. ఎంతంటే?
By: Tupaki Desk | 29 April 2021 3:42 PM GMTభారత్ భయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ టీకా ధర తగ్గింది. గతంలో ఒక్క డోసును రూ.600గా నిర్ణయించిన ఉత్పత్తి సంస్థ.. ఇప్పుడు రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో.. కొవాగ్జిన్ ఇకపై 400 రూపాయలకే అందుబాటులోకి రానుంది.
మరోవైపు సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ కూడా ధర తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను గతంలో రూ.400గా నిర్ణయించింది. అయితే.. ఇప్పుడు వంద రూపాయలు తగ్గిస్తూ రూ.300గా ప్రకటించింది. ఈ విషయాన్ని సీరం ఇనిస్టిట్యూట్ నిన్ననే ప్రకటించింది. మర్నాడే కొవాగ్జిన్ కూడా ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
కొవిడ్ వ్యాక్సిన్ కొనుగోలు బాధ్యతను రాష్ట్రాలకే వదిలేసిన కేంద్రం.. రూ.400 వెచ్చించి వ్యాక్సిన్ కొనుక్కోవాలని చెప్పింది. అదే సందర్భంలో.. కేంద్రానికి మాత్రం రూ.150కే వ్యాక్సిన్ అందుతోంది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీ సంస్థలకు కేంద్రం లేఖ రాసింది. ధరలు తగ్గించాలని కోరింది. దీంతో.. ఈ రెండు సంస్థలు రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.