Begin typing your search above and press return to search.

చిన్నారులపై కోవాక్సిన్‌ ట్ర‌య‌ల్స్‌.. ఢిల్లీ ఎయిమ్స్‌లో ప్రయోగాలు !

By:  Tupaki Desk   |   7 Jun 2021 4:30 AM GMT
చిన్నారులపై కోవాక్సిన్‌ ట్ర‌య‌ల్స్‌.. ఢిల్లీ ఎయిమ్స్‌లో ప్రయోగాలు !
X
మనదేశంలో 18 ఏళ్లు పైబడినవారందరికీ కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిన్న పిల్లలకు కూడా టీకా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలను ప్రారంభించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవ్యాక్సిన్ టీకా చిన్నారులపై ట్రయల్స్‌ కు డీసీజీఐ అనుమతిచ్చింది. ఈ మేరకు ఢిల్లీ ఎయిమ్స్‌ లో చిన్నారుల‌పై కోవిడ్ టీకా ట్రయ‌ల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ ట్రయల్స్‌ ను 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలపై నిర్వహించనున్నారు. ఈ వ్యాక్సిన్ పిల్లలకు అనుకూలంగా ఉంటుందా.. లేదా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతాయా అనేది తెలుసుకోనున్నారు.

ఇదిలా ఉంటే... దేశంలో ప్రస్తుతం సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. వైరస్‌ నుంచి రక్షణ పొందేందుకు తగినంత మందికి టీకాలు వేయకపోతే మూడో వేవ్‌ లో వినాశనం సృష్టించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలపై థర్డ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని ఇప్పటివకే వైద్య నిపుణులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం అప్రమత్తమై పిల్లలకు కూడా టీకా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా 2 నుంచి 18 ఏళ్ల మధ్యనున్న పిల్లలపై రెండో దశ, మూడో దశ ట్రయల్స్‌ నిర్వహణకు భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్ కోవ్యాక్సిన్ కు మే 13న కేంద్రం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో కోవిషీల్డ్‌, కోవ్యాక్సిన్‌, స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్లను మాత్రమే 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు వేస్తున్నారు. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది.