Begin typing your search above and press return to search.
జనసేనలోనూ కోవర్టులట... పవన్ డౌటానుమానం...?
By: Tupaki Desk | 22 Aug 2022 1:38 PM GMTరాజకీయాల్లో అన్నీ సహజం. ఒక పార్టీ లో ఉంటూ వేరే పార్టీలో బెర్త్ కన్ఫర్మ్ చేసున్న వారూ ఉన్నారు. సొంత ఇంటి వంటి పార్టీకి తనకు అన్ని విధాలుగా న్యాయం చేసిన నాయకుడినీ వెన్నుపోటు పొడిచిన వారూ ఉన్నారు. అయితే అధినాయకుడు అన్న వాడు సమర్ధుడు అయినపుడు ఇలాంటివి జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. అన్నింటి కంటే తన నాయకత్వం మీద జనాలల్లో నమ్మకం కలిగేలా చేసుకుంటే ఇలాంటివి ఏ మాత్రం ప్రమాదం చేయలేవు. ఇక పార్టీలో నాయకులు ఎపుడూ తాము ఎదగాలని అనుకుంటారు.
ఇవన్నీ అన్ని పార్టీలలో ఉన్నవే. అయితే ఇలాంటివి ఏదో జరుగుతాని, భూతద్దంతో వెతికితే ఏ పార్టీ ముందుకు పోదు, ముందు నాయకత్వానికి బాధ్యత అప్పగించాలి. వారు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా అన్నది అధినాయకుడు ఒక కంట కనిపెట్టాలి. జనసేన విషయంలో ఇలాంటి అనుమానాలు సవాలక్షగా ఉన్నట్లుగా ఉన్నాయి కాబోలు. అందుకే ఆయన ఎక్కడా తానూ నాదెండ్ల మనోహర్ తప్ప మిగిలిన వారెవరూ కనిపించకపోవడానికి అనేక సందేహాలు పార్టీ అధినాయకత్వానికి ఉండడం వల్లనే అని అంటారు.
ఇక పవన్ కళ్యాణ్ తాజాగా కొన్ని కామెంట్స్ చేశారు. తమ పార్టీలోనూ కోవర్టులు ఉన్నారని బాంబు పేల్చారు. సాధారణంగా ఏ పార్టీ అధినాయకుడు ఇలాంటి కామెంట్స్ చేయరు. ఉంటే ఉంటారు, వారి విషయంలో పార్టీ నాలుగు గోడల మధ్యన హెచ్చరిస్తూంటారు. నాకు అందరి జాతకాలూ తెలుసు, జాగ్రత్తగా ఉండండి అని జనరలైజ్ చేస్తూ చెబుతారు. కానీ పవన్ తీరు వేరు కదా. ఆయన మీడియా సమావేశంలోనే తమ పార్టీ లోగుట్టు బయటపెట్టేసుకున్నారు.
మా పార్టీలో కోవర్టులు ఉన్నారు. వారి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పుకొచ్చారు. మరి పవన్ ఎవరి గురించి అంటున్నారు అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. నిజానికి జనసేనలో నాదెండ్ల పవన్ తరువాత రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరూ కనిపించరు. ఇక జిల్లాలలో ఎవరైనా ఉంటే వారు అంత ఫొకస్ అయ్యే చాన్స్ లేదు. ఈ నేపధ్యంలో కోవర్టులు పార్టీని డ్యామేజ్ చేసే వారు జనసేనలో ఎవరు ఉన్నారు అన్న చర్చ మొదలైంది.
అయితే కోవర్టులను ఏరేస్తామని, క్రమ శిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని మరీ చర్యలు తీసుకుంటామని పవన్ అంటున్నారు. పవన్ ఈ మాటలు అంటున్నారు అంటే ఆయనకు నిజంగా ఆ కోవర్టుల గురించి తెలుసా అన్న చర్చ కూడా సాగుతోంది. తనను ముందుకు వెళ్లనీయకుండా ఆ కోవర్టులు వెనక్కి లాగుతున్నారని కూడా పవన్ అన్నారు అంటే పవన్ కి ఇంకా బాగా వారి గురించి తెలిసే ఉండాలి.
అందువల్లనే ఆయన ఇలా బాహాటంగా చెబుతున్నారు అనుకోవాలి. ఒక వేళ అధినాయకుడు దాన్ని గుర్తిస్తే మాత్రం వెంటకే చెక్ చేసుకుని సరైన యాక్షన్ తీసుకోవాల్సిందే. మొత్తానికి పవన్ కోవర్టులు మా పార్టీలో ఉన్నారు అన్న మాట మాత్రం జనసేనలో ఒక చిన్నపాటి కల్లోలాన్నే తీసుకువస్తుందని అంటున్నారు.