Begin typing your search above and press return to search.

న్యూయార్క్ రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు

By:  Tupaki Desk   |   5 April 2022 4:22 AM GMT
న్యూయార్క్ రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు
X
అమెరికా కరోనా కల్లోలానికి మరోసారి చేరువైంది. అత్యధిక కేసులు సంభవిస్తున్నాయి. గత సంవత్సరంలో కోవిడ్ కారణంగా అమెరికాలో అత్యధిక మరణాల రేటును ఇప్పటికే తాకింది. ప్రపంచంలో అత్యధిక కేసులు.. మరణాలు అమెరికాలో పోయిన ఏడాది నమోదయ్యాయి. వరుసగా 75,316,209 కేసులు.. 8,90,528 మరణాలతో అమెరికా ప్రపంచంలోనే అత్యంత దెబ్బతిన్న దేశంగా నిలిచింది.

అమెరికాను మరోసారి కరోనా భయపెడుతోంది. ముఖ్యంగా న్యూయార్క్ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తోంది. న్యూయార్క్ రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు పుంజుకుంటున్నాయి. ఓమిక్రాన్ తాజా వేరియంట్ బీఏ.2 సబ్-వేరియంట్ మెజారిటీ ఇన్‌ఫెక్షన్‌లకు కారణం అవుతోంది. రాష్ట్ర అధికారులు సోమవారం విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. ఏడు రోజుల్లో 1,00,000 మందికి కోవిడ్ -19 కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం కరోనా పాజిటివిటీ రేటు 17.8కి పెరిగింది., ఇది మూడు వారాల క్రితం 8.2 నుంచి ఈ స్థాయికి చేరింది.

కోవిడ్-19 పరీక్షల్లో ఏడు రోజుల సగటు పాజిటివిటీ రేటు ఆదివారం 3 శాతానికి చేరుకుంది. మార్చి 13 న 1.4 శాతంగా ఉందని అమెరికా వైద్యవర్గాలు నివేదించాయి.. ప్రత్యేకించి సెంట్రల్ న్యూయార్క్ ప్రాంతం ఏడు రోజుల సగటు పాజిటివ్ రేటు 9.64 శాతంతో హాట్‌స్పాట్‌గా కనిపిస్తోంది. ఆదివారం నాడు కోవిడ్-19 పరీక్షలో న్యూయార్క్ నగరం ఏడు రోజుల సగటు సానుకూల రేటులో 2.21 శాతం నివేదించింది. మాన్‌హాటన్ బరోలో 3.17 శాతానికి పెరిగింది.

న్యూయార్క్ రాష్ట్రంలో ఆదివారం 2,553 మంది పాజిటివ్ పరీక్షించగా, న్యూయార్క్ నగరంలో 1,142 మంది పాజిటివ్ గా తేలారు. న్యూయార్క్ స్టేట్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. మార్చి 13 నుండి 26 వరకు సేకరించిన మొత్తం నమూనాలలో ఓమిక్రాన్ బీఏ.2 సబ్-వేరియంట్ 59.6 శాతంగా ఉంది. " అమెరికాలో ప్రతి ఒక్కరికీ కోవిడ్‌కు వ్యతిరేకంగా టీకాలు వేశారు.

వ్యక్తిగత ఉత్తమ రక్షణ మార్గంగా టీకా పనిచేస్తోంది. ఓమిక్రాన్ సబ్-వేరియంట్ బీఏ.2 ఇటీవలి భారీగా విస్తరిస్తూ కేసులకు కారణమవుతోంది. కోవిడ్ ఇప్పటికీ అమెరికాలో ప్రబలంగానే ఉంది" అని న్యూయార్క్ స్టేట్ హెల్త్ కమీషనర్ మేరీ టి ప్రజలను హెచ్చరించారు.

న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్ శనివారం రెండో కోవిడ్-19 వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌లు తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కోవిడ్-19 వ్యాక్సిన్ రెండో బూస్టర్‌ను ఆయన కూడా తీసుకొని ప్రజలందరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు.