Begin typing your search above and press return to search.
అమెరికాలో 50 వేలు దాటినా కరోనా మృతులు!
By: Tupaki Desk | 24 April 2020 7:50 AM GMTకరోనా మహమ్మారి అమెరికాలో మరణమృదంగం మోగిస్తుంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి ..చైనా లో కంటే అమెరికాలోనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. తాజాగా అమెరికాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 50వేలు దాటింది. నిన్న ఒక్క రోజే అమెరికాలో 2342 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 50,243గా నమోదైంది. ఈ కరోనా వైరస్ వల్ల అమెరికాలోనే ఎక్కువమంది మరణించారు.
అమెరికాలో ఇప్పటివరకు మొత్తం 8,86,709 కేసులు నమోదయ్యాయి. ఇక వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 82268గా ఉంది. కాగా , ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 27 లక్షలు దాటింది. మొత్తం 27,15,614 కేసులు నమోదు కాగా, మొత్తం 1,90,422 మరణాలు చోటుచేసుకున్నాయి. అటు.. 7,45,045 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
అయితే, అమెరికాలో కరోనా ఉధృతి తగ్గింది. గతంతో పోల్చిచూస్తే ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉందని అక్కడి అధికారులు ప్రకటించారు.అమెరికాలో కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కొంతమేర తగ్గింది. కానీ ఇప్పటికే కరోనాతో బాధ పడుతున్న వారిలో ఎక్కువ మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతుంది. తాజాగా సంభవిస్తున్న మరణాలు అన్ని కూడా ఈ కోవకి చెందినవే. అటు స్పెయిన్ - ఇటలీ దేశాల్లో కూడా కరోనా వ్యాప్తి తగ్గినప్పటికీ మరణాల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది.
ఇకపోతే , మరోవైపు నేడు అమెరికా సర్కార్.. 484 బిలియన్ల డాలర్ల ఉద్దీపన్ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. చిన్న పరిశ్రమలకు, వైరస్ పరీక్షలకు ఆ నిధులను కేటాయిస్తారు. మహమ్మారి ప్రబలుతున్న సమయం లో.. ట్రంప్ ప్రభుత్వం నాలుగోసారి రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించింది.