Begin typing your search above and press return to search.
కరోనా కారణంగా ఆ దేశంలో ప్రతి 10 నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారట
By: Tupaki Desk | 21 March 2020 1:30 AM GMTకరోనా క్రియేట్ చేస్తున్న విలయం అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు తప్పించి.. మిగిలిన అన్ని దేశాలు కరోనా కారణంగా కిందామీదా పడుతున్నాయి. ఇటలీ.. ఫ్రాన్స్.. ఇరాన్ లాంటి దేశాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం ఆయా దేశాల్లో కరోనా మూడో స్టేజ్ లోకి వెళ్లిపోవటం.. రోజు తిరిగే సరికి కరోనాకు ఎఫెక్ట్ అయ్యే వారు వందల నుంచి వేలల్లోకి వెళ్లిపోతోంది. దీంతో.. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇరాన్ ప్రభుత్వం చిక్కుకుంది.
ఇరాన్ లో చోటు చేసుకున్న పరిస్థితుల గురించి ఆ దేశానికి చెందిన అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రతి గంటకు ఇరాన్ లో 50 మంది వరకూ కరోనాకు గురి అవుతున్నట్లు చెప్పారు. ప్రతి పది నిమిషాలకు ఒకరు చొప్పున కరోనా కారణంగా మరణిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. కరోనా వ్యాప్తిని అడ్డుకోవటం సాధ్యం కావట్లేదన్న మాటను వారుచెబుతున్నారు.
ఇప్పటి వరకూ ఆ దేశంలో కరోనా కారణంగా 1200 మంది మరణిస్తే.. తాజా లెక్కల ప్రకారం 18,400 మంది ప్రజలు కరోనా బారిన పడినట్లుగా ఆ దేశ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా వెలువడుతున్న రిపోర్టుల ప్రకారం ప్రతి గంటకు ఆరుగురు చొప్పున మరణిస్తున్నారని.. ఇదే తీవ్రత కొనసాగితే.. రానున్న రోజుల్లో ఆ దేశం మరిన్ని సమస్యల్లో చిక్కుకు పోవటం ఖాయమంటున్నారు.