Begin typing your search above and press return to search.
లేటెస్ట్ సర్వే : మే లో కరోనా విజృంభణ !
By: Tupaki Desk | 22 April 2020 5:15 AM GMTకరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచంలో వీరవిహారం చేస్తుంది. మన దేశంలో కూడా రోజురోజుకి కరోనా వైరస్ తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోతుంది. ఈ నేపథ్యంలో వచ్చే రోజుల్లో మన దేశంలో కరోనా మహమ్మారి ఏ మలుపు తీసుకోనుంది? రెండో దశ లాక్ డౌన్ ముగిసే సమయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎంతగా పెరగనుంది? అనేది అంచనా వేసేందుకు ఓ ప్రముఖ ఆంగ్ల వార్తా చానల్ అధ్యయనం జరిపింది. ఇందుకోసం ససెప్టిబుల్, ఎక్స్ పోజ్డ్, ఇన్ఫెక్టెడ్, రెజిస్టంట్ (ఎస్ ఈఐ ఆర్) సహా పాలీ నోమియల్ రిగ్రెషన్ రకానికి చెందిన రెండు గణాంక విశ్లేషణా పద్ధతులను వినియోగించారు.
ఈ అధ్యయనం కోసం కరోనా మహమ్మారి వ్యాప్తి పై కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేస్తున్న రోజువారీ బులెటిన్ లలోని సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. వాటి ఆధారంగా అధ్యయనం జరపగా.. మే 3 వరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 54,230కి చేరొచ్చని ఎస్ ఈఐ ఆర్ నమూనాలో వెల్లడైంది. ఈ సంఖ్యను మిగతా రెండు పద్ధతుల్లో వచ్చిన కేసుల సంఖ్యలతో కలిపి సగటు తీస్తే 38,534 వచ్చింది. ఎంపిక చేసిన కొన్ని రంగాలకు ఏప్రిల్ 20 నుంచి సడలింపులు ఇచ్చినందున, ఆ ప్రభావం తో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని తెలిపింది.
ఇక మే 14 వచ్చే సరికి కరోనా కేసులు ఏకంగా 2.09 లక్షలకు చేరొచ్చని ఎస్ ఈఐ ఆర్ నమూనా తెలిపింది. మిగతా రెండు నమూనాల్లో మాత్రం కేసులు వరుసగా 26,442.. 34,095కు పెరగొచ్చని తేలింది. ఈ మూడు అధ్యయన నమూనాల్లో వచ్చిన ఫలితాల సగటు మాత్రం 65,601 వచ్చింది. లాక్ డౌన్ అమలు తీరు, ప్రజల వ్యవహారశైలి, ఇన్ఫెక్షన్ల వ్యాప్తిరేటు ఆధారంగా కేసుల సంఖ్య పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది నిర్ణయమవుతుందని అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్ఠిగా ముందుకు వెళితే కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యమేనని అభిప్రాయపడ్డారు.