Begin typing your search above and press return to search.
మేల్కోని అమెరికా: 4 లక్షలకు కరోనా కేసులు
By: Tupaki Desk | 8 April 2020 2:00 PM GMTముందస్తు వ్యూహం లేకపోవడం.. నిర్లక్ష్య ధోరణి.. అంచనా వేయకపోవడం.. నిఘా వర్గాల వైఫల్యం వంటి కారణాలతో ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఆ మహమ్మారితో అగ్రరాజ్యం పోరాడలేక చేతులెత్తేసింది. దాని పరిణామంతోనే ఇప్పుడు లక్షలాది ప్రజలు ఆ వైరస్ బారిన పడగా.. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. అగ్రరాజ్యంలోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడడంతో మానవ ప్రపంచం నివ్వెరపోతోంది. అయితే తాజాగా ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 4 లక్షలు దాటేశాయి. వైరస్ పుట్టిన చైనాలోనే ఇన్ని కేసులు నమోదు కాలేదు. కానీ అమెరికాలో ఏకంగా చైనాకు రెట్టింపు స్థాయిలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఆ దేశంలో ఇప్పటివరకు 400,549 కరోనా కేసులు నమోదు కాగా 12,840 మంది ఆ వైరస్‌తో పోరాడుతూ మృత్యువాత పడ్డారు. అయితే ఆ 4 లక్షల మందిలో కేవలం 21,674 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
అయితే మంగళవారం ఒక్క రోజే అమెరికాలో 1,970 మంది కరోనాతో మృతిచెందారు. ఆ దేశంలో కొత్తగా నమోదవుతున్న కేసులు భారీగానే నిన్న 24 గంటల్లో ఏకంగా 33,331 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలోని న్యూయార్క్ - న్యూజెర్సీ రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తూ లక్షలాది మందిని ప్రమాదంలో నెట్టేస్తోంది. వచ్చే వారం ఆ రెండు రాష్ట్రాల నుంచి మరణాల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా నివారణకు అమెరికాలో పకడ్బందీగా చర్యలు తీసుకోవడం లేదు. ఆ దేశంలో అంతలా కరోనా దావానంలా వ్యాపిస్తున్నా లాక్ డౌన్ ప్రకటించడం లేదు. ఆంక్షలు విధిస్తున్నారు మినహా దేశంలో అత్యావసర పరిస్థితి విధించడం లేదు. దీంతో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తుండడాన్ని గుర్తించడం లేదు. ఇప్పటికీ అగ్రరాజ్యం అమెరికా మేలుకోవడం లేదు.
అయితే అమెరికా తర్వాత రెండోస్థానంలో స్పెయిన్ ఉంది. అత్యధిక కేసులు నమోదవుతున్న దేశంగా స్పెయిన్ నిలుస్తోంది. ఆ దేశంలో రోజుకు దాదాపు 5 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆ దేశంలో ఇప్పటివరకు కరోనా కేసులు 1,46,690 నమోదు కాగా 14,555మంది కరోనా బారిన పడి మృతిచెందారు. అయితే స్పెయిన్ లో పరిస్థితులు దారుణంగా మారాయి. వయసు పైబడిన వృద్ధులకు వైద్యం చేయడం మానేసి వారిని వదిలేసి యువతను ఆస్పత్రుల్లో చేర్చుకుంటున్నారు. వృద్ధులు ఆ వైరస్ బారిన పడి మృతిచెందుతున్నారు. వారిని కాపాడేందుకు ఆ దేశంలో చర్యలు తీసుకోవడం లేదు.
ఇక ఇక కరోనా కేసుల నమోదులో ఇటలీ మూడో స్థానంలో ఉండగా మరణాల రేటులో మాత్రం మొదటి స్థానంలో ఉంది. రెండు వారాల కిందట మొదటి స్థానంలో ఉన్న ఇటలీ ఇప్పుడు మూడో స్థానంలో ఉంది. ఇటలీలో కేసుల నమోదు అదుపులో ఉండగా మరణాల రేటు మాత్రం భయంకరంగా ఉంది. అక్కడ కరోనా బారిన పడి మృతిచెందిన వారు 17,127 మంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగానే పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 14,50,079 కేసులు నమోదు కాగా, మరణాలు 83, 466కు చేరవయ్యాయి.