Begin typing your search above and press return to search.
ముంబై జర్నలిస్టులకు కరోనా !!
By: Tupaki Desk | 13 April 2020 5:40 PM GMTకేసులు తగ్గుతాయని ఆశగా ఎదురుచూస్తున్న ప్రభుత్వానికి, ప్రజలకు రోజూ నిరాశే మిగులుతుంది. ఇప్పటివరకు నమోదైన కేసులు ప్రతి ఒక్కటీ కాంటాక్ట్ ట్రేసింగ్ చేసినా.. ఇవి పుట్టలోంచి చీమలు వచ్చినట్టు వస్తున్నాయి. రెండ్రోజుల క్రితం.. మర్కజ్ కేసులన్నీ తేలిపోయాయి కాబట్టి... ఇంక ఏమీ రావని ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించినా ఆగడం లేదు. పైగా ఇటీవలి కాలంలో ఈరోజు అత్యధికంగా నమోదయ్యాయి. ఈ ఒక్కరోజే 61 కొత్త కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 592కి చేరింది. ఈరోజు ఒకరు చనిపోయారు. దీంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య తెలంగాణలో 17కు చేరింది. ఇంతవరకు 117 మందిని డిశ్చార్జి చేయగా... ఇంకా 472 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
ఇదిలా ఉండగా... మొత్తం కేసుల్లో హైదరాబాదువే 216 కేసులున్నాయి. తర్వాత 35 కేసులతో నిజామాబాద్ రెండో స్థానంలో ఉంది. వికారాబాద్ 24 కేసులతో మూడో స్థానంలో ఉంది. వీటి తర్వాత రంగారెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లా, జోగులాంబ, సూర్యాపేట, మేడ్చల్, నిర్మల్, నల్గొండ, అదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి. జనగాం జిల్లాలో ఉన్న రెండు డిశ్చార్జి కావడంతో అక్కడ ఇపుడు ఏ కేసులు లేవు.
ముంబైలో కరోనా విలయతాండవం తెలిసిందే. దేశంలోనే ఈ నగరంతో పాటు మహారాష్ట్ర మొత్తం అత్యధిక కేసులు నమోదయ్యాయి. రెండ్రోజుల క్రితం తాజ్ హోటల్ సిబ్బందికి కరోనా సోకడం ముంబైలో సంచలనం రేపగా.. తాజాగా ముంబైలో 6 గురు జర్నలిస్టులకు కరోనా సోకింది. దీంతో ఉలిక్కిపడిన ప్రభుత్వం మొత్తం జర్నలిస్టులకు టెస్టులు నిర్వహించాలని ఆదేశించింది. దేశంలో వైరస్ రెండో దశకు, మూడో దశకు మధ్య ఊగిసలాడుతోంది. కాంటాక్ట్ ట్రేసింగ్ అత్యంత తీవ్రంగా నిర్వహిస్తున్నా కూడా ఊహించని చోట కొత్త కేసులు రావడం ప్రభుత్వాలను కలవరానికి గురిచేస్తోంది.