Begin typing your search above and press return to search.

పెట్టుబడి కూడా రాదనుకుంటే..వరల్డ్ లోనే నంబర్ 1..'సీరం' సక్సెస్ స్టోరీ ఇది..!

By:  Tupaki Desk   |   2 Jan 2021 11:30 PM GMT
పెట్టుబడి కూడా రాదనుకుంటే..వరల్డ్ లోనే నంబర్ 1..సీరం సక్సెస్ స్టోరీ ఇది..!
X
సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ 1 వ్యాక్సిన్ సంస్థగా అవతరించింది. తక్కువ ధరకు వ్యాక్సిన్లు పంపిణీచేస్తున్న ఏకైక సంస్థ సీరం. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ - ఆస్ట్రాజెనెకా - కోడజెనిక్స్‌ - నోవావాక్స్‌ - థెమిస్‌ వంటి ఔషధసంస్థలు సీరంతో భాగస్వామ్యం అయ్యాయి. ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ను సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్నది. మనదేశంలో కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి కూడా అనుమతులు వచ్చేశాయి. అనుమతి వచ్చినవెంటనే వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానున్నది. డీజీసీఐ అనుమతి ఇచ్చిన వెంటనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది.

కాగా ఇటీవల సీరం కంపెనీ సీఈవో అదార్ పూనవల్లా వాషింగ్ టన్ పోస్ట్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన కుటుంబానికి చెందిన 250 మిలియన్ డాలర్ల ఆస్తులను కరోనా వ్యాక్సిన్ కోసం ఖర్చుపెట్టానని చెప్పారు. అయితే తన తండ్రి కూడా వ్యాక్సిన్ పై పెట్టుబడి పెట్టేందుకు పెద్దగా సుముఖంగా లేరని చెప్పారు. అదార్ తండ్రి.. సైరస్ పూనవల్లా ఆయన వ్యాక్సిన్ కింగ్ గా ఖ్యాతి గడించారు.

అయితే మొదట్లో పూనవల్లా కరోనా వ్యాక్సిన్ కు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చిండాన్ని వ్యతిరేకించారట. నువ్వు జూదంలో పెడుతున్నట్టు 250 మిలియన్ డాలర్లు కరోనా వ్యాక్సిన్ కోసం పెడుతున్నావనని అదర్తో అన్నాడట. ఈ విషయాన్ని ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం సీరం తయారు చేసిన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. సక్సెస్ ఇవ్వడంతో పాటు పేరు కూడా తెచ్చాయి.తన తండ్రి వ్యతిరేకించినా చివరికి అదార్ పట్టిన పట్టు విడవకుండా ప్రజలకు ఉపయోగపడే పనిలో భాగస్వామిగా నిలబడి విజయం సాధించాడు.