Begin typing your search above and press return to search.
తీపికబురు.. దసరా నాటికి వ్యాక్సిన్
By: Tupaki Desk | 19 April 2020 5:10 AM GMTభూమి మీద మనిషికి మించిన శక్తివంతుడు మరొకరు లేరన్న బలుపును కంటికి కనిపించని కరోనా తీర్చేయటమే కాదు.. గజగజ వణికేలా చేసింది. మనిషి సాధించాల్సింది చాలానే ఉందన్న విషయాన్ని స్పష్టం చేసింది మాయదారి వైరస్. ప్రపంచ దేశాల్ని కరోనా వైరస్ కు చెక్ పెట్టే వ్యాక్సిన ఎప్పుడు అందుబాటులోకి వస్తుందోనని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ వర్సిటీ వ్యాక్సినోలజీ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ తీపి కబురు చెబుతున్నారు.
వచ్చే నెలలో కరోనా వ్యాక్సిన్ ను ప్రయోగించేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలిదశలో ఈ వ్యాక్సిన్ నమూనాను 18-55 ఏళ్ల వారి పైన ప్రయోగిస్తారు. ఈ ట్రయల్స్ కానీ సక్సెస్ అయితే.. అక్టోబరు (దగ్గర దగ్గర దసరా నాటికి) లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు.
తాజాగా చేస్తున్న పరిశోధనలతో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే.. భారీ స్థాయిలో వ్యాక్సిన తయారుచేసే సామర్థ్యాన్ని సాధిస్తామంటున్నారు. 1994 నుంచి వ్యాక్సిన్లపై గిల్బర్ట్ పరిశోధనలు చేస్తున్నారు. కరోనా మీద ప్రపంచ వ్యాప్తంగా పలు పరిశోధనలు జరుగుతుండగా.. ఇమ్యునైజేషన్ దశ నుంచి క్లినికల్ ట్రయల్స్ దశకు వచ్చిన ప్రయోగాల్లో గిల్బర్ట్ టీందే తొలి స్థానం.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తయారు చేసే పనిలో 70 సంస్థలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇందులో ఇప్పటికే మూడు సంస్థలు మనుషులపై ప్రయోగాలు చేశాయి. తాజాగా గిల్బర్ట్ చేస్తున్న ప్రయోగంలో భాగంగా 510 మంది వలంటీర్లను ఐదు గ్రూపులుగా విభజించి వారికి వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. ఆర్నెల్ల పాటు వారిని పర్యవేక్షిస్తారు. తొలి ఇమ్యునైజేషన్ ఇచ్చిన నాలుగు వారాల తర్వాత ఈ ఐదు గ్రూపుల్లోని ఒక గ్రూపు వారికి వ్యాక్సిన్ రెండో డోసు ఇస్తారు. దాని పనితీరును అంచనా వేయటంతో పాటు.. ఇతర దేశాల్లో వ్యాక్సిన్ మీద పని చేస్తున్న వారితో కలిసి తాము తీసుకొచ్చిన ఫలితంపై మరింత లోతుగా అధ్యయనం చేస్తారు. మొత్తంగా కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ ను తయారు చేయటానికి చేస్తున్న ప్రయత్నాలు దసరా నాటికి కొలిక్కి రావటమే కాదు.. తీపికబురు వచ్చే వీలుందంటున్నారు.