Begin typing your search above and press return to search.
కోవిడ్ 19.. కేరాఫ్ మిస్టరీ.. ఎందుకంటే?
By: Tupaki Desk | 5 April 2020 5:30 PM GMTఅందరూ కరోనా అంటున్నారు కానీ.. ఇప్పుడు ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్నది కొవిడ్ 19. సింఫుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే.. కరోనా వైరస్ అన్నది ఒక పెద్ద కుటుంబం అయితే.. అందులో కొవిడ్ 19 అన్నది కొత్తగా గుర్తించిన కటుుంబ సభ్యుడు. ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. ఈ కొత్త సభ్యుడి తీరు.. ఇప్పటివరకూ ఎవరిలో లేని చిత్రవిచిత్రమైన గుణాలు ఉండటం. ప్రపంచంలో ఇప్పటివరకూ వైరస్ ఏదైనా సరే.. ఒకసారి బాడీలో చేరిన తర్వాత.. దాని బారిన పడ్డాక.. దాన్ని అధిగమించే గుణం శరీరంలోని రోగనిరోధక శక్తికి వచ్చేస్తుంది.
ఈ కారణంతోనే మాయదారి వైరస్ లు ఒకసారి వచ్చిన తర్వాత.. మళ్లీ మళ్లీ రావటం చాలా అరుదు. అందుకు భిన్నంగా కోవిడ్19 విషయంలో మాత్రం అలాంటి పరిస్థితి నెలకొంది. ఒకసారి దీని బారిన పడినోళ్లు.. కొద్దిరోజులకే దీని బారిన పడటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. కరోనా విజేతగా నిలిచి.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కూడా మళ్లీ కోవిడ్ 19 సోకటం షాకింగ్ గా మారింది.
ఒక వైరస్ ను శరీరం జయించిన తర్వాత.. కొన్ని రోజుల పాటు.. లేదంటే కొన్నేళ్ల పాటు ఆ వైరస్ ప్రభావం శరీరం మీద పడకుండా ఉండే వ్యవస్థ ప్రతి ఒక్కరి శరీరంలో ఉంటుంది. అందుకు భిన్నంగా కోవిడ్ 19 తీరు ఉండటం శాస్త్రవేత్తలకు ఇప్పుడు మింగుడుపడటం లేదు. సాధారణంగా వైరస్ ఏదైనా కానీ ఒక శరీరంలోకి ప్రవేశించిన తర్వాత లోపలున్న యాంటీ బాడీతో పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఒకవేళ.. యుద్ధంలో వైరస్ చనిపోతే.. పేషంట్ కాస్తా నార్మల్ అవుతారు. అందుకు భిన్నంగా ఈ యుద్ధంలో యాంటీ బాడీస్ ఓటమి పాలైతే.. మనిషి మరణిస్తారు.
సాధారణంగా ఉన్న రూల్ ప్రకారం వైరస్ ను ఓడించిన తర్వాత శరీరంలోని యాంటీబాడీస్.. మరోసారి ఆ వైరస్ దాడి చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటాయి. కోవిడ్ 19 విషయంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నట్లుగా చెబుతున్నారు. ఒకసారి కోవిడ్ 19 బారిన పడి.. కోలుకున్న తర్వాత మళ్లీ వెంటనే మరోసారి శరీరంలోకి ప్రవేశించటం.. ఆ క్రమంలో యాంటీబాడీస్ వాటిని నిలువరిస్తాయి. కానీ.. కోవిడ్ 19 విషయంలో మాత్రం యాంటీబాడీస్ చేతులు ఎత్తేయటం ఎందుకన్నది శాస్త్రవేత్తలకు మింగుడుపడటం లేదు. ఈ దిశగా సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. దీని మిస్టరీ తేలే వరకూ కోవిడ్ 19ముప్పు ప్రపంచానికి తొలగనట్లే.