Begin typing your search above and press return to search.
నిన్న సోనియాకు.. నేడు ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్
By: Tupaki Desk | 3 Jun 2022 7:12 AM GMTఈడీ కేసులు ఇలా చుట్టుముట్టాయో లేదో కాంగ్రెస్ అధినేత్రికి కరోనా సోకింది. ఆమెకు కరోనా సోకిందని చికిత్స అందుతోందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సోనియాకు అంటిన కరోనా ఇప్పుడు ఆమె కుమార్తె ప్రియాంక గాంధీకి కూడా పాకింది. ప్రియాంకకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
తనకు తేలికపాటి లక్షణాల తర్వాత కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ గా వచ్చిందని ప్రియాంక శుక్రవారం వెల్లడించారు. అలాగే పరిచయం ఉన్న వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రియాంక గాంధీ విజ్ఞప్తి చేసింది.
ప్రియాంక ఈ మేరకు ట్వీట్ చేసింది. ‘నాకు స్వల్ప లక్షణాలు ఉండడంతో కోవిడ్19 పరీక్ష నిర్వహించామని.. అన్ని ప్రోటోకాల్ లను అనుసరించి తాను హోం ఐసోలేషన్ లో ఉంటున్నానని వివరించింది. నాతో పరిచయం ఉన్న వారు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నానని ప్రియాంక పేర్కొంది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన రెండు రోజుల లక్నో పర్యటనను తగ్గించుకొని బుధవారం రాత్రి ఢిల్లీకి తిరిగి వచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పాజిటివ్ గా తేలకముందే ఆమెతో ప్రియాంక సన్నిహితంగా ఉన్నారు. ఆ తర్వాత లక్నో నుంచి ఢిల్లీకి తిరిగివస్తుండగా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ గా తేలింది.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని నడిపిన ప్రియాంక గాంధీ పెద్దగా సక్సెస్ కాలేదు. 2024 సార్వత్రిక ఎన్నికలకు పార్టీని పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 2 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది.
అదే సమయంలో కపిల్ సిబాల్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ కు ఈ రాష్ట్రం నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఎస్పీ మద్దతుతో రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్థిగా సిబల్ నాబినేషన్ దాఖలు చేశారు.