Begin typing your search above and press return to search.
పిల్లల చదువులపై కోవిడ్ దెబ్బ.. నీతి ఆయోగ్ నివేదిక చెబుతున్నదిదే!
By: Tupaki Desk | 6 Jun 2022 9:09 AM GMTకోవిడ్ దేశంలో చిన్నారుల చదువులపై పెను ప్రభావం చూపిందా అంటే అవుననే చెబుతోంది.. నీతి ఆయోగ్ నివేదిక. దేశంలోని మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లల చదువులపై అధ్యయనం చేసిన నీతి ఆయోగ్ ఈ మేరకు తన నివేదికను తాజాగా విడుదల చేసింది.
దీని ప్రకారం పిల్లల చదువులపై కోవిడ్ మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపిందని తెలిపింది. ప్రధానంగా లాక్‌డౌన్ సమయంలో మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లల చదువులు, ఆరోగ్య సంరక్షణ తదితర అంశాల్లో ఏర్పడిన అంతరాయాలపై నీతి ఆయోగ్ అధ్యయనం చేసింది. లాక్ డౌన్ సమయంలో దేశంలోని అన్ని పాఠశాలలు, ప్రీస్కూల్స్, అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేయాల్సి వచ్చింది. దీంతో పిల్లల చదువులకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని నీతి ఆయోగ్ తెలిపింది. ఈ వివరాలను డిసెంబర్ 2020 నుంచి ఫిబ్రవరి 2021 మధ్య సేకరించినట్లు వెల్లడించింది.
కోవిడ్ సంక్షోభంలో చిన్నారుల అభ్యసనానికి వీలుగా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు సంవత్సరంపాటు దూరవిద్య అందించేందుకు చర్యలు చేపట్టాయి. టిజిటల్, టీవీ, రేడియో, ఇంటర్నెట్ మాధ్యమాల ద్వారా పిల్లల అభ్యసనానికి చర్యలు తీసుకున్నాయి. అయితే.. దేశంలోని చాలా మంది చిన్నారులకు ఈ దూరవిద్య అందలేని నీతి ఆయోగ్ బాంబు పేల్చింది.
దేశంలో 42 శాతం కుటుంబాల్లోని పిల్లలకు మాత్రమే కొంతమేర చదువుకునే అవకాశం కలిగిందని వెల్లడించింది. మిగతా కుటుంబాల పిల్లలకు అస్సలు దూరవిద్య అందలేదని నీతిఆయోగ్ అధ్యయనం సోదాహరణంగా పేర్కొంది. ఉదాహరణకు కోవిడ్‌కు ముందు ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే అత్యధికంగా మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 84 శాతం మంది స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చేరారని.. అయితే సంక్షోభ సమయంలో ఏపీలో కేవలం 29 శాతం కుటుంబాల్లోని పిల్లలకు మాత్రమే దూరవిద్య అందిందని ఆ నివేదిక తెలిపింది.
అలాగే, రాజస్థాన్‌లో 23 శాతం మంది, తమిళనాడులో 17 శాతం మంది కుటుంబాల్లోని చిన్నారులకు మాత్రమే దూరవిద్య అందింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో దూర విద్య ఎక్కువ శాతం పిల్లలకు అందుబాటులో ఉండగా.. కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉందని నీతి ఆయోగ్ నివేదిక వివరించింది.
అలాగే 2020 మార్చి కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో దేశంలోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరు వీడియోలు చూడటానికి అలవాటుపడ్డారని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. ఇందుకు టీవీలు, ఫోన్లు వినియోగించారని పేర్కొంది. తమ పిల్లలు కంప్యూటర్‌లో గేమ్‌లు కూడా ఆడారని 41 శాతం పట్టణ తల్లిదండ్రులు చెప్పడం విశేషం.